అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Blankets | చలికాలం వచ్చిందంటే స్వెటర్స్ (Sweaters), బ్లాంకెట్స్ వాడకం పెరుగుతుంది. అయితే వాటిని ఉతకడం అంటే చాలా మందికి భయమే. ఎంత బాగా ఉతికినా దుమ్ము సరిగ్గా వదలదు, పైగా నీటిలో నుంచి బయటికి తీయాలంటే చేతులకు నొప్పులు రావాల్సిందే.
అలాంటి ఇబ్బందులు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండానే పెద్ద బ్లాంకెట్స్‌ను ఈజీగా ఉతకడానికి ఒక సింపుల్ ట్రిక్ (Simple Trick) ఉంది. దీనికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. కేవలం రెండు సాధారణ వస్తువులతోనే ఎంత పెద్ద బ్లాంకెట్ అయినా చక్కగా శుభ్రం చేయవచ్చు. ముందుగా కావాల్సినవి .. వేడి నీరు, ఒక పెద్ద టబ్, వాషింగ్ పౌడర్, మీకు నచ్చిన షాంపూ ఉంటే సరిపోతుంది.
Blankets | ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..
ముందుగా పెద్ద టబ్‌లో వేడి నీరు (Hot Water) పోసి, అందులో కొద్దిగా వాషింగ్ పౌడర్, షాంపూ వేసి బాగా కలపాలి. ఆ తర్వాత బ్లాంకెట్‌ను పూర్తిగా నీటిలో ముంచి కొంతసేపు నానబెట్టాలి. కనీసం రెండు నుంచి మూడు గంటలు నాననివ్వడం వల్ల బట్టలోని దుమ్ము, చెమట మరకలు సులువుగా వదులుతాయి. బాగా నానిన తర్వాత బ్లాంకెట్‌ను బయటికి తీసి మరకలు ఎక్కువగా ఉన్న చోట బ్రష్‌తో (Small Brush) లేదా చేతులతో రబ్ చేయాలి. చేతులతో రాయడం కష్టం అనిపిస్తే కాళ్ల కింద వేసి మెల్లగా తొక్కినా సరిపోతుంది. ఇలా చేస్తే లోపల దాచుకున్న దుమ్మంతా బయటికి వస్తుంది. తర్వాత శుభ్రమైన నీటిలో బ్లాంకెట్‌ను ముంచి, బయటికి తీస్తూ రెండు మూడు సార్లు కడగాలి. నీరు పూర్తిగా స్వచ్ఛంగా వచ్చేవరకు ఇలా చేయాలి.
నీరు బాగా పోయిన తర్వాత బ్లాంకెట్‌ను పూర్తిగా పిండకుండా, కొద్దిగా స్క్వీజ్ చేస్తూ ఓ చైర్ లేదా స్టూల్‌పై ఉంచితే మిగిలిన నీరు కారిపోతుంది. ఆ తర్వాత ఒకసారి మెల్లగా పిండి, గాలివచ్చే చోట తీగపై ఆరేయాలి. సరిగ్గా ఆరితే దుర్వాసన (Bad Smell) రాదు, బ్లాంకెట్ కూడా మృదువుగా ఉంటుంది. ఈ పద్ధతి బ్లాంకెట్స్కే కాదు, బరువైన స్వెటర్స్, దుప్పట్లు వంటి పెద్ద బట్టలు ఉతకడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎక్కువ శ్రమ లేకుండా, ఇంట్లోనే ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. కాబట్టి ఇకపై పెద్ద బ్లాంకెట్స్ ఉతకడం కష్టమనే భావన పక్కనపెట్టి, ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి.