Homeబిజినెస్​WhatsApp AI photos | వాట్స‌ప్ యూజ‌ర్స్‌కు గుడ్​న్యూస్.. ఏఐ ఫొటోలను క్రియేట్ చేసేందుకు కొత్త...

WhatsApp AI photos | వాట్స‌ప్ యూజ‌ర్స్‌కు గుడ్​న్యూస్.. ఏఐ ఫొటోలను క్రియేట్ చేసేందుకు కొత్త ఫీచ‌ర్

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: WhatsApp AI photos | ప్ర‌ముఖ మెస్సేజింగ్ యాప్ వాట్స‌ప్ ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫీచ‌ర్స్‌తో అద‌ర‌హో అనిపిస్తోంది. ఇప్పుడు కొత్త ‘ఇమాజిన్’ ఫీచర్‌ ద్వారా చాట్‌లలో నేరుగా ఏఐ ఫొటోలను (AI photos) క్రియేట్ చేసే అవ‌కాశం క‌లిగించింది. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా ప్లాట్‌ఫాంలో యూజర్లు ఈజీగా అద్భుతమైన ఏఐ ఫొటోలను జనరేట్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ “Imagine” అనే పదంతో టెక్ట్స్​ ప్రాంప్ట్‌ను టైప్ చేయగానే ఏఐ సెకన్లలో సంబంధిత ఫొటోను రూపొందిస్తుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలు, భాషలలో మాత్రమే ఈ ఏఐ ఫీచర్ అందుబాటులో ఉంది.

WhatsApp AI photos | అద్భుత‌మైన ఫీచ‌ర్..

ఇమేజ్ జనరేషన్‌తో సహా మెటా-ఏఐ ఫీచర్‌లు (Meta-AI features) ప్రస్తుతం నిర్దిష్ట ప్రాంతాలకే పరిమితం అయ్యాయి. సపోర్టు కలిగిన దేశాలలో కూడా యూజర్లను బట్టి యాక్సెస్ మారవచ్చు. ప్రత్యేకించి.. ఇంగ్లిష్, అరబిక్, ఫ్రెంచ్, హిందీ, ఇండోనేషియన్, పోర్చుగీస్, స్పానిష్, తగలోగ్, థాయ్, వియత్నామీస్ వంటి భాషలు ఉన్నాయి. మీకు ఇంకా ఆప్షన్ కనిపించకపోతే కొద్ది రోజులు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దు. అయితే AI ఫొటోలను ఎలా క్రియేట్ చేయాలి అంటే ముందుగా మెటా ఏఐతో చాట్ ఓపెన్ చేయండి. (సపోర్టు ఉంటే మీ కాంటాక్ట్స్ కింద కనిపిస్తుంది). మెసేజ్ ఫీల్డ్‌లో టైప్ చేయండి. మీ ప్రాంప్ట్ తరువాత Imagine అని ఏదైనా టైప్ చేసి ఆ త‌ర్వాత Send ట్యాప్ చేయండి. మెటా ఏఐ మీ ప్రాంప్ట్‌కు తగిన ఫొటోను జనరేట్ చేస్తుంది.

డౌన్‌లోడ్ కోసం ఫొటోపై హోవర్ చేసి మెనూ ఐకాన్​ను క్లిక్ చేయండి. గ్రూపులో లేదా పర్సనల్ చాట్‌లో ఏఐ ఫొటోలు ఎలా? అంటే ఏదైనా పర్సనల్ లేదా గ్రూప్ చాట్‌ని ఓపెన్ చేయండి. మెసేజ్ ఫీల్డ్‌లో @ అని టైప్ చేసి ఆపై Imagine ఎంచుకోండి. మీ ప్రాంప్ట్ రాయండి (ex.. futuristic city underwater). Send ఆప్షన్ ట్యాప్ చేయండి. ఏఐ జనరేటెడ్ ఇమేజ్ మీ చాట్‌లో నేరుగా కనిపిస్తుంది. AI ఇమేజ్‌ ఎలా అప్‌డేట్ చేయాలి? అంటే ఫొటోను ఎడిట్ చేయాలన్నా లేదా మరింత క్రియేటివిటీగా మార్చాలన్నా వాట్సాప్ కొత్త ప్రాంప్ట్‌తో ఫొటోను అప్‌డేట్ చేయొచ్చు. మెటా ఏఐ చాట్‌ ప్రకారం.. గతంలో క్రియేట్ చేసిన ఫొటోపై మౌస్ కర్సర్ ఉంచండి. మెనూ ఐకాన్ క్లిక్ చేసి ఆపై రిప్లయ్ ఇవ్వండి. అప్‌డేట్ ప్రాంప్ట్‌ను టైప్ చేసి Send క్లిక్ చేయండి. పర్సనల్ లేదా గ్రూపు చాట్‌లో.. AI ఫొటోపై హోవర్ చేసి మెనుపై క్లిక్ చేయాలి. ఆపై రిప్లయ్ ఇవ్వండి. @ అని టైప్ చేసి మెటా ఏఐ ఎంచుకోవాలి. ఆపై ఎడిట్ చేసిన ప్రాంప్ట్‌తో imagine ఆప్షన్ ఎంచుకోండి. Send క్లిక్ చేయండి. కొత్త ఇన్‌పుట్ ఆధారంగా చాట్ రిఫ్రెష్ ఫొటో కనిపిస్తుంది.