HomeUncategorizedPune Traffic | పుణె ట్రాఫిక్.. నా ఫ్రెండ్ దుబాయ్ చేరుకున్నా.. నేను ఇంకా ట్రాఫిక్‌లోనే..

Pune Traffic | పుణె ట్రాఫిక్.. నా ఫ్రెండ్ దుబాయ్ చేరుకున్నా.. నేను ఇంకా ట్రాఫిక్‌లోనే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Pune Traffic | ట్రాఫిక్ ఈ పదం వింటేనే చాలా మందికి చిరాకు వస్తుంది. ముఖ్యంగా ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కునే వారి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2 నిమిషాలు ఆగాల్సి వచ్చినా హారన్లు మోగిస్తూ.. తెగ ఆయాస పడిపోతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం. ఎండ, వర్షం వంటివి ఎక్కువైతే మరింత నరకం చూస్తుంటారు. ముఖ్యంగా మవ దేశంలోని అనేక నగరాల్లో ఈ ట్రాఫిక్ సమస్యలు ఉండగా.. బెంగళూరు(Bangalore), పుణె(Pune), ముంబయి(Mumbai), ఢిల్లీ(Delhi) వంటి ప్రాంతాల ప్రజలు మరింత ఎక్కున ట్రాఫిక్‌లోనే గడిపేస్తుంటారు.

Pune Traffic | ట్రాఫిక్ చిక్కులు..

కనీసం రోజుకు రెండు, మూడు గంటల పాటు వారి జీవితం ట్రాఫిక్‌లోనే ఉంటుంది. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా చేసిన సర్వేలే చెబుతున్నాయి. ఆసియాలోనే అత్యంత అధ్వానమైన ట్రాఫిక్ సమస్యలు(Traffic problems) ఎదుర్కొనే నగరాల్లో భారతదేశంలోనే రెండు నగరాలే అగ్రస్థానంలో నిలిచాయి. ముఖ్యంగా బెంగళూరు మొదటి స్థానంలో నిలవగా.. పుణె రెండో స్థానంలో నిలిచింది. 10 కిలో మీటర్ల దూరం ప్రయాణించడానికి డ్రైవర్లు సగటున 28 నిమిషాల 10 సెకన్ల పాటు ట్రాఫిక్​లోనే ఉంటున్నారని తెలిపింది. పుణెలో వేగంగా పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న పట్టణ మౌలిక సదుపాయాల కారణంగానే ఈ నగరం తీవ్రమైన ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నట్లు కూడా వెల్లడించింది.

ట్రాఫిక్ సమస్యలను తగ్గించి.. రోడ్ల నిర్వహణను మెరుగు పరిచేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలం అవుతూనే వస్తున్నాయి. అయితే తాజాగా పుణె ట్రాఫిక్‌(Pune Traffic)కి సంబంధించిన ఓ నెటిజ‌న్ చేసిన పోస్ట్ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. నా స్నేహితురాలు దుబాయ్​కి వెళుతున్న నేప‌థ్యంలో పుణె విమానాశ్రయం(Pune Airport)లో ఆమెను దింపాను. ఆమె దుబాయ్ చేరుకుంది మరియు నేను ఇంకా పుణె ట్రాఫిక్​లో చిక్కుకున్నాను అని అన్నాడు. అంటే పుణె ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ వైర‌ల్‌గా మారింది.