అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Balakrishna | ఒక్క ఎమోజీ రెండు వర్గాల మధ్య సోషల్ మీడియా యుద్ధానికి దారి తీసింది. హైదరాబాద్ సీపీగా (Hyderabad CP) ఉన్న సమయంలో సీవీ ఆనంద్ పెట్టిన ఓ ఏమోజీపై బాలకృష్ణ అభిమానులు, వ్యతిరేకులు రెండు వర్గాలుగా విడిపోయి సోషల్ వార్ చేస్తున్నారు.
రెండు నెలలుగా పోస్టుల యుద్ధం సాగుతోంది. దీంతో తాజాగా సీవీ ఆనంద్ బాలకృష్ణకు (Balakrishna) క్షమాపణ చెప్పారు. హైదరాబాద్ సీపీగా ఉన్న సమయంలో సీవీ ఆనంద్ టీం తెలుగు సినిమాలను పైరసీ చేస్తున్న ఒక ముఠాను అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన పలువురు సినీ ప్రముఖులతో పైరసీకి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు. అయితే ఈ మీటింగ్‌కు బాలకృష్ణను ఆహ్వానించలేదు. పలువురు సినీ ప్రముఖులను ఆహ్వానిస్తూ.. సెప్టెంబర్ 29న సీవీ ఆనంద్ పోస్ట్ చేశారు. దీనికి ఓ వ్యక్తి బాలకృష్ణను ఎందుకు ఆహ్వానించలేదని, ఆయన ఏపీ అసెంబ్లీలో ఈ సమస్యను లేవనెత్తేవారని వ్యంగ్యంగా పోస్ట్ పెట్టారు. దీనికి సీవీ ఆనంద్ అకౌంట్ నుంచి నవ్వుతున్నట్లు ఎమోజీ రిప్లయ్ వచ్చింది. అప్పటి నుంచి ఆ పోస్టుపై సోషల్ మీడియాలో (Social Media) పెద్ద యుద్ధమే సాగుతోంది.
Balakrishna | సారీ చెప్పడంతో..
దాదాపు రెండు నెలల తర్వాత ప్రస్తుతం హోం శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న సీవీ ఆనంద్ (CV Anand) ఆ పోస్టుపై స్పందించారు. దాదాపు రెండు నెలల క్రితం పెట్టిన ఒక ఎమోజీ కోసం.. బాలయ్య అభిమానులు, విమర్శకులు ఒకరితో ఒకరు గొడవ పడడం, తనను లక్ష్యంగా చేసుకోవడం గమనించినట్లు తెలిపారు. సమయం లేకపోవడం, నగరంలోని వివిధ సంఘటనలు, కేసులు మరియు ఇతర సమస్యలను ఎక్స్, ఇన్‌స్టాలో చేయడానికి తన సోషల్ మీడియాను నిర్వహించడానికి ఓ వ్యక్తి ఉండేవాడని ఆయన తెలిపారు.
సెప్టెంబర్ 29న జరిగిన ప్రెస్ మీట్ (Press Meet) తర్వాత బాలయ్యపై పోస్ట్‌కు సమాధానంగా ఆయన ఒక ఎమోజీని పోస్ట్ చేశారని చెప్పారు. అది పూర్తిగా అనవసరం, ఆయన అలా చేయకూడదని అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు తనకుదాని గురించి తెలియదని చెప్పారు. ఈ వివాదం గురించి తెలుసుకున్న తర్వాత ఆ పోస్టును తొలగించి బాలకృష్ణకు మెసేజ్ చేశానని చెప్పారు. అది ఆయనను బాధపెట్టి ఉంటే క్షమాపణలు కూడా చెబుతున్నానని ఆయన పేర్కొన్నారు. దీనిని ఇక్కడితో ముగించాలని ఆయన కోరారు. సీవీ ఆనంద్ క్షమాపణ చెప్పడంతో బాలయ్య అభిమానులు శాంతించారు.
