GST Reforms | జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ కారు ధర ఎంత తగ్గనుందంటే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ 2.0తో చాలా వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. దీంతో సామాన్యులకు ఊరట లభించబోతోంది. ప్రధానంగా వాహనాల తయారీ కంపెనీలు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వాహనాల కంపెనీలు ధరలు తగ్గించగా.. మరికొన్ని ఈనెల 22 నుంచి అమలు చేయనున్నాయి. ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీ(GST)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 1200CC వరకు ఇంజిన్‌ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ 2.0తో చాలా వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. దీంతో సామాన్యులకు ఊరట లభించబోతోంది.

ప్రధానంగా వాహనాల తయారీ కంపెనీలు జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను కస్టమర్లకు బదిలీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని వాహనాల కంపెనీలు ధరలు తగ్గించగా.. మరికొన్ని ఈనెల 22 నుంచి అమలు చేయనున్నాయి.

ప్రభుత్వం చిన్న కార్లపై జీఎస్టీ(GST)ని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. 1200CC వరకు ఇంజిన్‌ సామర్థ్యంతో పెట్రోల్‌ ఇంజిన్‌ ఉండి 4 మీటర్ల కంటే తక్కువ పొడువు ఉన్న కార్లతోపాటు 1500 సీసీ వరకు డీజిల్‌ వాహనాలకు 18 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. 1500 సీసీ కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పెద్ద కార్లు, ఎస్‌యూవీ(SUV)లపై 12 శాతం అదనంగా జీఎస్టీ పడనుంది. అయితే జీఎస్టీ పెరిగినా 17 నుంచి 22 శాతం వరకు సెస్‌(Cess) తొలగించడంతో లగ్జరీ వాహనాలపైనా ఊరట లభించనుంది. ఆయా వాహనాలపై 5 నుంచి 10 శాతం వరకు ధర తగ్గనుంది. ఈనెల 22 నుంచి కొత్త శ్లాబ్‌లు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో జీఎస్టీ సంస్కరణల వల్ల ఏ కారు ధర ఎంత తగ్గనుందన్న ఆసక్తి ప్రజలలో నెలకొంది. ఆ వివరాలు తెలుసుకుందామా..

మహీంద్రా కార్ల ధర ఎంత తగ్గొచ్చంటే..

స్కార్పియో క్లాసిక్‌ కారుపై రూ.1.01 లక్షలు.
బొలెరో నియో కారుపై రూ.1.27 లక్షలు.
మహీంద్రా థార్‌ ఆర్వోఎక్స్‌ఎక్స్‌ రూ.1.33 లక్షలు.
మహీంద్రా థార్‌ రేంజ్‌ కారుపై రూ.1.35 లక్షలు.
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో పెట్రోలు కారుపై రూ.1.40 లక్షలు.
ఎక్స్‌యూవీ 700 కారుపై రూ.1.43 లక్షలు.
స్కార్పియో ఎన్‌ కారుపై రూ.1.45 లక్షలు.
ఎక్స్‌యూవీ 3ఎక్స్‌వో డీజిల్‌ కారుపై రూ.1.56 లక్షలు.

టాటా మోటార్స్‌ కార్లపై..

టాటా కర్వ్‌ కారుపై రూ.65 వేలు.
టియాగో కారుపై రూ.75 వేలు.
టిగోర్‌ కారుపై రూ.80 వేలు.
టాటా పంచ్‌ కారుపై రూ.85 వేలు.
ఆల్ట్రోజ్‌ కారుపై రూ. 1.10 లక్షలు.
హారియర్‌ కారుపై రూ.1.40 లక్షలు.
సఫారీ కారుపై రూ. 1.45 లక్షలు.
నెక్సాన్‌ కారుపై రూ.1.55 లక్షలు.

టయోటా కార్లపై..

కామ్రీ కారుపై రూ.1.01 లక్షలు.
ఇతర మోడళ్లపై రూ.1.11 లక్షలు
ఇన్నోవా హైక్రాస్‌ కారుపై రూ.1.15 లక్షలు.
ఇన్నోవా క్రిస్టా పై రూ.1.80 లక్షలు.
హీలక్స్‌ కారుపై రూ.2.52 లక్షలు.
వెల్‌ఫైర్‌ కారుపై రూ.2.78 లక్షలు.
లెంజండర్‌ కారుపై రూ.3.34 లక్షలు.
ఫార్చునర్‌ కారుపై రూ.3.49 లక్షలు.

స్కోడా కార్లపై..

స్కోడా స్లావియా కారుపై రూ.63 వేలు.
స్కోడా కుషాక్‌ కారుపై రూ.66 వేలు.
స్కోడా కోడియాక్‌ కారుపై రూ.3.30 లక్షలు.

రెనాల్ట్‌ కార్లపై..

రెనాల్ట్‌(Renault) కైగర్‌ కార్ల ధర గరిష్టంగా రూ. 96,395 వరకు తగ్గనుంది.

బీఎండబ్ల్యూ కార్లపై..

బీఎండబ్ల్యూ 2 సిరిసీ గ్రాన్‌ కోప్‌ కారు ధర రూ. 45.3 లక్షలకు తగ్గుతుంది.
ఎక్స్‌1 కారు ధర రూ.50.6 లక్షలు
3 సిరీస్‌ ఎల్‌డబ్ల్యూబీ కారు ధర రూ.60.5 లక్షలకు దిగివస్తుంది.
5 సిరీస్‌ ఎల్‌డబ్ల్యూబీ కారు ధర రూ.72.4 లక్షలకు తగ్గుతుంది.
ఎక్స్‌ 5 కారు ధర రూ.1.003 కోట్ల నుంచి రూ.93.7 లక్షలకు తగ్గుతుంది.
ఎక్స్‌7 కారుపై రూ.1.2 కోట్లకు తగ్గుతుంది.

హ్యూందాయ్‌ కార్లపై..

వెర్నా ధర రూ. 60,640.
క్రెటా ఎన్‌ లైన్‌ రూ.71,762.
క్రెటా ధర రూ.72,145
గ్రాండ్‌ ఐ10 నియోస్‌ ధర రూ. 73,808.
అల్కాజర్‌ ధర రూ.75,376
ఆరా కారుపై రూ. 78,465.
ఎక్స్‌టెర్‌ కారుపై రూ. 89,209.
హ్యూందాయ్‌ ఐ20 కారు ధర రూ. 98,053.
ఐ20 ఎన్‌ లైన్‌ ధర రూ. 1.08 లక్షలు.
వెన్యూ రూ. 1.23 లక్షలు.
టక్సన్‌ కారు ధర రూ.2.40 లక్షలు.

మారుతీ సుజుకీ కార్లు..

ఎక్స్‌ఎల్‌ 6 రూ.35 వేలు.
ఎస్‌- ప్రెస్సో రూ.38 వేలు.
ఆల్టో కే10 ధర రూ.40 వేలు.
ఎర్టిగా రూ.41 వేలు.
సెలేరియో రూ.50 వేలు.
ఈకో రూ.51 వేలు.
ఇగ్నిస్‌ రూ.52 వేలు.
వెగన్‌ ఆర్‌ రూ.57 వేలు.
స్విఫ్ట్‌ రూ.58 వేలు.
బాలెనో రూ.60 వేలు.
డిజైర్‌ రూ.61 వేలు.
ఫ్లాంక్స్‌ రూ.68 వేలు.
బ్రెజా రూ.78 వేలు.
జిమ్నీ రూ.1.14 లక్షలు.
ఇన్‌విక్టో రూ.2.25 లక్షలు.

మెర్సిడేస్‌ బెంజ్‌ కార్లపై..

ఏ 200డీ ధర రూ.2.60 లక్షలు.
జీఎల్‌ఏ 220డీ 5 మ్యాటిక్‌ ధర రూ.3.7 లక్షలు.
జీఎల్‌సీ300 4 మ్యాటిక్‌ ధర రూ.5.30 లక్షలు.
ఈ క్లాస్‌ ఎల్‌డబ్ల్యూబీ 450 4 మ్యాటిక్‌ ధర రూ.6 లక్షలు.
జీఎల్‌ఈ 450 4మ్యాటిక్‌ ధర రూ.8 లక్షలు.
జీఎల్‌ఐస్‌ 450డీ ఏఎంజీ లైన్‌ కారుపై రూ.10 లక్షలు.
ఎస్‌ క్లాస్‌ ఎస్‌ 450 4మ్యాటిక్‌ కారుపై రూ.11 లక్షలు.

Related articles

Basara IIIT Student | బాసర ట్రిపుల్​ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basara IIIT Student | నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్​ ఐటీ (IIIT)లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంజినీరింగ్​...

KTR on Mallanna Jathara | దైవ దర్శనానికి వెళ్తే దాడి చేస్తారా : కేటీఆర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR on Mallanna Jathara | నాగర్​ కర్నూల్ (Nagar Kurnool) జిల్లా కుమ్మెర మల్లన్న (Kummera Mallanna) జాతరలో...

Medical Students Ground Demand | క్రీడామైదానం కోసం జూడాల డిమాండ్​.. జీజీహెచ్​లో నిరసన​

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Medical Students Ground Demand | శాశ్వత క్రీడామైదానం ఏర్పాటు చేయాలని జూనియర్​ డాక్టర్లు (JUDA Protest) డిమాండ్​ చేశారు....

Saudi Poultry Import Ban | సౌదీ కీలక నిర్ణయం.. భారత్​ నుంచి కోళ్లు, గుడ్ల దిగుమతిపై నిషేధం

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Saudi Poultry Import Ban | సౌదీ అరేబియా (Saudi Arabia) కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​ సహా 40 దేశాల...