అక్షరటుడే, వెబ్‌డెస్క్: GST on gold | కేంద్ర ప్రభుత్వం(Central government) జీఎస్టీ సంస్కరణలు చేపట్టి సామాన్యులకు పండుగ కానుక ఇచ్చింది. నూతన శ్లాబ్‌లతో చాలా వస్తువుల ధరలు పదినుంచి 28 శాతం వరకు తగ్గబోతున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రకటన గురువారం రాత్రి వెలువడిన విషయం తెలిసిందే.
జీఎస్టీ(GST) స్వరూపంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇంతకుముందు ఉన్న నాలుగు శ్లాబ్‌ల విధానం స్థానంలో రెండు స్లాబ్‌ల విధానాన్ని తీసుకువచ్చింది. గతంలో ఉన్న 12 శాతం, 28 శాతం శ్లాబ్(Slab)లను పూర్తిగా తొలగించిన కేంద్రం.. 5, 18 శాతం శ్లాబ్‌లను మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఇది ఈనెల 22వ తేదీనుంచి అమలులోకి రానుంది.
దీంతో నిత్యావసర వస్తువులు, మందులతోపాటు ఇతర వస్తువులపైనా పన్నుల భారం తగ్గనుంది. ఈ నేపథ్యంలో అందరి చూపూ బంగారంపై కేంద్రీకృతమై ఉంది. బంగారం(Gold), బంగారు ఆభరణాలపై సర్కారు ఎంత మేర జీఎస్టీ తగ్గించిందో తెలుసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. అయితే బంగారం, బంగారు ఆభరణాలపై జీఎస్టీ విషయంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు. పాత వాటినే కొనసాగించాలని నిర్ణయించారు. ఎప్పటిలాగే బంగారం, వెండిపై 3 శాతం జీఎస్టీ వర్తించనుంది.
ఇది ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ (Digital gold), కాయిన్లు, బార్లు అన్నింటిపై వర్తిస్తుంది. ఇక గోల్డ్ జువెల్లరీ తయారీ చార్జీలపై 5 శాతం జీఎస్టీ అమలవుతుంది. రూ. లక్ష విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే 3శాతం జీఎస్టీ (ఇందులో 1.5 శాతం సెంట్రల్ జీఎస్టీ(CGST), 1.5 శాతం స్టేట్ జీఎస్టీ) పడుతుంది. అంటే లక్ష రూపాయల విలువైన బంగారం కొనుగోలు చేస్తే 3 శాతం అంటే రూ. 3 వేలు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందన్న మాట.. తయారీ చార్జీలు షాపులను బట్టి మారుతుంటాయి. తయారీ చార్జీల(Making charges)పై 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.