- Advertisement -
HomeUncategorizedAkshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారంటే..

Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Akshaya Tritiya | అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే మంచిదని భారతీయులు నమ్ముతారు. అందుకే ప్రతి ఏడాది అక్షయ తృతీయ (Akshaya Tritiya) సందర్భంగా భారీ స్థాయిలో పసిడి విక్రయాలు(Gold sales) జరగుతాయి.

ధనవంతులతో పాటు మధ్య తరగతి వారు కూడా ఈ రోజున ఎంతో కొంత బంగారం(Gold) కొంటారు. పెద్ద పెద్ద నగల దుకాణాలు కూడా కస్టమర్లను ఆకట్టుకోవడాని అక్షయ తృతీయ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు(Special offers) ఇస్తాయి. కాగా.. ఈ ఏడాది అక్షయ తృతీయకు బంగారం విక్రయాలు తగ్గాయి. బంగారం ధరలు(Gold Prices) భారీగా పెరగడంతో జనం కొనుగోలు చేయడానికి వెనకంజ వేశారు.

- Advertisement -

గతేడాది అక్షయ తృతీయ రోజు తులం బంగారం రూ.72,300 ఉంటే, ఏడాది రూ.98 వేల వరకు ఉంది. దీంతో విక్రయాలు అనుకున్న స్థాయిలో జరగలేదని మార్కెట్(Market)​ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది పండుగ రోజు 20 టన్నుల బంగారం విక్రయాలు జరగ్గా ఈ సారి కూడా అంతే మొత్తంలో జరిగినట్లు తెలిపాయి. వీటి విలువ రూ.18 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. బంగారం ధరలు ఈ మధ్య భారీగా పెరగడంతో ప్రజలు గోల్డ్ ETFలపై మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడి విక్రయాలు తగ్గాయని నిపుణులు పేర్కొంటున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News