ePaper
More
    Homeజిల్లాలుజనగాంGoogle Map | గూగుల్​ మ్యాప్ ఎంత పని చేసింది.. వాగులో పడ్డ కారు

    Google Map | గూగుల్​ మ్యాప్ ఎంత పని చేసింది.. వాగులో పడ్డ కారు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Google Map | ప్రస్తుతం సాంకేతిక పెరిగింది. చేతిలో స్మార్ట్​ఫోన్(Smartphone)​ ఉంటే చాలు అన్ని తెలుసుకోవచ్చు. దీంతో ప్రస్తుతం ప్రజలు టెక్నాలజీకి బానిసలు అయిపోయారు. ప్రతిదానికి ఫోన్​ను వినియోగిస్తున్నాం. గతంలో ఎక్కడికైనా వెళ్లాలంటే దారి తెలియకపోతే ఆ మార్గంలోని స్థానికులను అడుగుతూ వెళ్లేవాళ్లం. ప్రస్తుతం గూగుల్​ మ్యాప్స్​(Google Maps) సాయంతో ఎక్కడా ఆగకుండా దూసుకుపోతున్నాం. అయితే అప్పుడప్పుడు గూగుల్​ మ్యాప్​ చేసే పొరపాట్లతో వాహనాదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.

    ప్రస్తుతం ఎక్కడికైనా వెళ్లాలంటే గూగుల్​ మ్యాప్​లో డెస్టినేషన్(Destination​)​ సెలెక్ట్​ చేసుకొని అది చెప్పిన మార్గంలో వెళ్తున్నారు. ఇలాగే వెళ్తూ ఇటీవల ఓ కారు ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో నిర్మాణంలో ఉన్న వంతెనపై నుంచి కింద పడింది. తాజాగా తెలంగాణ (Telangana)లోని జనగామలో సైతం గూగుల్​ మ్యాప్​ని నమ్ముకొని వెళ్తున్న ప్రయాణికులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు.

    READ ALSO  Rain Alert | అల్పపీడన ద్రోణి ప్రభావం.. నేడు, రేపు భారీ వర్షాలు పడే ఛాన్స్..

    Google Map | తిరుపతికి వెళ్తుండగా..

    మహారాష్ట్రలోని నాగ్​పూర్​ నుంచి కొంతమంది యువకులు కారులో తిరుపతికి బయలు దేరారు. వారు గూగుల్​ మ్యాప్​ ఆధారంగా ప్రయాణం ప్రారంభించారు. ఈ క్రమంలో జనగామ జిల్లా (Jangaon District) వడ్లకొండలో వీరి కారు వాగులో పడిపోయింది. అక్కడ వంతెన నిర్మాణం జరుగుతోంది. దీంతో పక్కనుంచి తాత్కాలిక రోడ్డు వేశారు. అయితే గూగుల్​ మ్యాప్​లో స్ట్రెయిట్​గా చూపించింది. దీనికి తోడు అక్కడ ఎలాంటి హెచ్చరిక బోర్డులు కూడా లేవు. దీంతో వేగంగా వెళ్తున్న కారు వాగులో పడిపోయింది. ఆ సమయంలో కారు ఐదుగురు యువకులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షించారు. అనంతరం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

    READ ALSO  Errabelli Dayakar Rao | నీళ్లివ్వ‌కుంటే సీఎం ఇంటి ముందు ధ‌ర్నా.. మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి హెచ్చ‌రిక‌

    Latest articles

    TGS RTC | ఆగని ఆర్టీసీ ప్రమాదాలు..

    అక్షరటుడే, లింగంపేట: TGS RTC | జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో...

    KTR | ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, లింగంపేట: KTR | మండల కేంద్రంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

    NSDL | ఎదురుచూపులకు తెర.. ఎట్టకేలకు పబ్లిక్‌ ఇష్యూకు ఎన్‌ఎస్‌డీఎల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NSDL | ఇన్వెస్టర్లు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న ఐపీవో(IPO) రాక ఖరారయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద డిపాజిటరీ సంస్థల్లో ఒకటైన...

    Stock Market | ఐటీ స్టాక్స్‌లో భారీ పతనం.. నష్టాలతో ముగిసిన ప్రధాన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Stock Market | ప్రధాన కంపెనీల క్యూ1 ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్‌ఐఐలు పెట్టుబడులు ఉపసంహరిస్తుండడం, యూఎస్‌తో వాణిజ్య...

    More like this

    TGS RTC | ఆగని ఆర్టీసీ ప్రమాదాలు..

    అక్షరటుడే, లింగంపేట: TGS RTC | జిల్లాలో ప్రతిరోజూ ఏదో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో...

    KTR | ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు

    అక్షరటుడే, లింగంపేట: KTR | మండల కేంద్రంలో గురువారం కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా...

    NSDL | ఎదురుచూపులకు తెర.. ఎట్టకేలకు పబ్లిక్‌ ఇష్యూకు ఎన్‌ఎస్‌డీఎల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:NSDL | ఇన్వెస్టర్లు ఎన్నాళ్లనుంచో ఎదురుచూస్తున్న ఐపీవో(IPO) రాక ఖరారయ్యింది. ప్రపంచంలోని అతిపెద్ద డిపాజిటరీ సంస్థల్లో ఒకటైన...