అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Online Gaming | దేశంలో ఎంతో మంది ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌కు బానిసలు మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి అప్పుల పాలు అవుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ బెట్టింగ్(Online Betting), గేమ్స్ నిషేధిస్తూ బిల్లు ఆమోదించిన విషయం తెలిసిందే.
ఆన్‌లైన్ గేమింగ్(Online Gaming) బిల్లు లోక్‌సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. రాష్ట్రపతి ఆమోదం తర్వాత ఆ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే ఆన్‌లైన్ గేమింగ్‌తో దేశంలో ఏటా ఎన్ని కోట్లు నష్టపోతున్నారనే లెక్కలను కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా దాదాపు 45 కోట్ల మంది ఏడాదికి సుమారు రూ.20 వేల కోట్లు(20 Thousand Crores) ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లో పోగొట్టుకుంటున్నారు.
Online Gaming | అత్యాశకు పోతే..
ఆన్‌లైన్ గేమ్స్‌లో చాలా రకాలు ఉంటాయి. కొన్ని అధృష్టం (లక్) పద్ధతిలో డబ్బులు ఎర వేస్తాయి. మరికొన్ని ఆటలు ఆడాల్సి ఉంటుంది. రమ్మీ(Rummy), తీన్‌పత్తి లాంటి గేమ్స్. వీటిలో తక్కువ డబ్బు పెడితే భారీగా వస్తాయని ప్రకటనలు చాలామందిని ఆకర్శిస్తున్నాయి. ఈజీ మనీకి అలవాటుపడిన నేటి యువత సులువుగా ఆన్‌లైన్ గేమింగ్ ట్రాప్‌లో పడుతున్నారు. అనంతరం ఉన్నదంతా కోల్పోతున్నారు. ఆ డబ్బులను తిరిగి పొందాలని అప్పు చేసి మరి గేమ్స్ ఆడుతున్నారు. చివరకు అప్పులు తీర్చే మార్గం లేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వారూ ఉన్నారు. ఈ క్రమంలో కేంద్రం ఆన్‌లైన్ గేమింగ్ నిషేధిస్తూ చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లును ఉభయ సభల్లో ఆమోదించింది.
Online Gaming | విదేశాలకు తరలుతున్న సంపద
డబ్బులు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమింగ్ సమాజానికి ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్(Betting Apps), ఆన్‌లైన్ గేమింగ్ నిర్వాహకులు విదేశాల నుంచి వాటిని నడిపిస్తున్నారు. దీంతో వేల కోట్ల రూపాయలు ఏటా విదేశాలకు తరలిపోతుంది. ప్రజలు నష్టపోతుండటంతో ప్రభుత్వం ఎట్టకేలకు ఆయా గేమ్స్‌పై నిషేధం కోసం బిల్లు తీసుకొచ్చింది. ఈ బిల్లు అమలులోకి వస్తే ఎంతో మందికి మేలు జరనుంది. ఈ బిల్లు ప్రకారం మనీ గేమింగ్‌లో పాల్గొన్న సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వాలు(State Governments) చర్యలు తీసుకుంటాయి.