అక్షరటుడే, ఇందూరు: Panchayat elections | జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) సందడి మొదలైంది. తొలి విడతలో భాగంగా మొదటి రోజు బోధన్ డివిజన్లో (Bodhan division) గురువారం నామినేషన్లను స్వీకరించారు. మొత్తం 11 మండలాల్లో 140 నామినేషన్లను దాఖలు చేశారు. బోధన్ మండలంలో 17, చందూర్ 6, కోటగిరి 13, మోస్రా 6, పోతంగల్ 14, రెంజల్ 12, రుద్రూర్ 10, సాలూర 17, వర్ని 19, ఎడపల్లి 9, నవీపేట్ 17 నామినేషన్లు దాఖలయ్యాయి.
Panchayat elections | కామారెడ్డి జిల్లాలో..

కామారెడ్డి: జిల్లాలో తొలిరోజు నామినేషన్లు జోరుగా దాఖలయ్యాయి. మొదటి విడత ఎన్నికలు జరిగే 167 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులుగా (sarpanch candidates) 115 మంది నామినేషన్ దాఖలు చేయగా 1,520 వార్డుల్లో 4,520 మంది నామినేషన్లు వేశారు. అనేక గ్రామాల్లో శుక్రవారం నామినేషన్ దాఖలు చేయాలనుకున్నా.. అష్టమి కారణంగా గురువారమే నామినేషన్లు వేశారు. మరికొందరు చివరి రోజు దశమి కావడంతో ఆదివారం నామినేషన్ వేయడానికి నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది.
