Homeజిల్లాలుకామారెడ్డిBanswada | మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణులకు ఎంతకష్టం.. గంటల తరబడి తప్పని నిరీక్షణ

Banswada | మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణులకు ఎంతకష్టం.. గంటల తరబడి తప్పని నిరీక్షణ

బాన్సువాడ పట్టణంలోని మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణులు సౌకర్యాలు అందుబాటులో లేవు. దీంతో వారు చికిత్స కోసం క్యూలైన్లలో నిలబడలేక అవస్థలు పడుతున్నారు.

- Advertisement -

అక్షరటుడే, బాన్సువాడ: Banswada | బాన్సువాడ మాతా శిశు ఆస్పత్రిలో (Maternal and Child Hospital) గర్భిణులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.. వైద్యం కోసం తెల్లవారుజామునే ఆస్పత్రికి చేరుకునే గర్భిణులు గంటల తరబడి ఆస్పత్రిలో నిరీక్షణలో ఉన్నారు. కానీ వారికి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండట్లేవు.

Banswada | కూర్చునేందుకు కనీసం కుర్చీలు కరువు..

కూర్చోవడానికి కుర్చీలు లేక చాలామంది నేలపైనే కూర్చుని వైద్యం కోసం వేచిచూస్తున్నారు. ప్రతిరోజు దాదాపు వందల సంఖ్యలో గర్భిణులు ఆస్పత్రికి వస్తున్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని సదుపాయాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రోగులు (Patients) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిండు గర్భిణులు సుదీర్ఘ నిరీక్షణలో మానసిక, శారీరకంగా అలసిపోతున్నారని వారి బంధువులు వాపోతున్నారు.

Banswada | కనీస సౌకర్యాలు సమకూర్చలేరా..?

ప్రభుత్వం తల్లీబిడ్డల (mothers and children) ఆరోగ్యం కోసం పలు పథకాలు అమలు చేస్తున్నా.. ఆస్పత్రి స్థాయిలో సరైన సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. హన్మాజీపేట్ నుంచి ఓ నిండు గర్భిణి స్కానింగ్ కోసం వస్తే చెకప్ చేసేవారు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురైంది. ఇలా ఆస్పత్రికి వచ్చే ప్రతి గర్భిణికి అవస్థలు తప్పడంలేదు.