అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Maharashtra Deputy CM | మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ వివాదంలో చిక్కుకున్నారు. ఐపీఎస్ అధికారి అంజనాకృష్ణను హెచ్చరిస్తూ ఆయన మాట్లాడిన వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోలాపూర్ జిల్లాలో మొరం అక్రమ తవ్వకాలపై చర్యలు చేపట్టడమే ఈ వివాదానికి కారణమైంది.
అయితే, పవార్ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నించలేదని ఎన్‌సీపీ స్పష్టం చేసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారని పేర్కొంది. రోడ్డు నిర్మాణం కోసం కర్మలా తాలూకాలోని కుర్దు గ్రామంలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని ఐపీఎస్ అధికారి అంజనా కృష్ణకు (IPS Officer Anjana Krishna) భారీగా ఫోన్లు వచ్చాయి. దీంతో తవ్వకాలను అడ్డుకునేందుకు సదరు అధికారి రెండ్రోజుల క్రితం ఆ గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడి స్థానికులు, ఎన్‌సీపీ కార్యకర్తలు అక్కడకు చేరుకుని అధికారులతో ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న ఎన్‌సీపీ కార్యకర్త ఒకరు డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు (Deputy CM Ajit Pawar) ఫోన్ చేసి విషయం చెప్పారు. ఈ క్రమంలో ఐపీఎస్ అధికారితో ఫోన్లో మాట్లాడిన అజిత్ పవార్ ఆమెను మందలిస్తున్న వీడియో వైరల్ అయ్యింది.
Maharashtra Deputy CM | ఎంత ధైర్యం నీకు..
ఎన్‌సీపీ కార్యకర్త (NCP Leader) అందించిన ఫోన్ తీసుకుని మాట్లాడిన ఐపీఎస్ అధికారిని అజిత్ పవార్ హెచ్చరించారు. వెంటనే మీరు అడ్డుకోవడం ఆపేయండని సూచించారు. అయితే, ఆమె మీరు డిప్యూటీ సీఎం అని ఎలా నమ్మాలి.. వీడియో కాల్ చేయండని కోరడంతో అజిత్ పవార్ రెచ్చిపోయారు. నీకు ఎంత ధైర్యం. నన్నే వీడియో కాల్ చేయమంటావా? నీపై చర్యలు తీసుకుంటా అని హెచ్చరించారు. “ఇత్నాఆప్కో డేరింగ్ హువా హై క్యా (మీకు ఎంత ధైర్యం),” అని ఆయన అధికారిని ప్రశ్నించారు. ఈ ఘటనను అక్కడ ఉన్నవారు ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.
అయితే, ఈ ఉదంతాన్ని తక్కువ చేసి చూపేందుకు ఎన్‌సీపీ ప్రయత్నించింది. వీడియో ఉద్దేశపూర్వకంగా వీడియో రికార్డు చేసి లీక్ చేశారని ఎన్‌సీపీ రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ తత్కరే (NCP State President Sunil Tatkare) పేర్కొన్నారు. “పార్టీ కార్యకర్తలను శాంతింపజేయడానికి అజిత్ దాదా ఐపీఎస్ అధికారిని మందలించి ఉండవచ్చు. చర్యను పూర్తిగా ఆపాలని ఆయన ఉద్దేశం కాదు” అని తత్కరే తెలిపారు. అజిత్ పవార్ ఎటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు ఎప్పుడూ మద్దతు ఇవ్వరని చెప్పారు.