అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Harish Rao | కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) విచారణ సక్రమంగా జరగలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆదివారం ఆయన అసెంబ్లీలో పీసీ ఘోష్ (PC Gosh) కమిషన్ నివేదికపై చర్చలో మాట్లాడారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చర్చను ప్రారంభించారు. స్పీకర్ హరీశ్‌రావుకు అరగంట సమయం ఇచ్చారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 650 పేజీల నివేదికపై అరగంటలో సమాధానం చెప్పమంటే ఎలా అని ప్రశ్నించారు. రెండు గంటల సమయం ఇవ్వాలని కోరారు. ఆయన విజ్ఞప్తి కాంగ్రెస్ అభ్యంతరం చెప్పింది. అనంతరం ఆయన చర్చలో పాల్గొన్నారు. కాళేశ్వరం నివేదికపై నాలుగు రోజులైనా చర్చకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరంపై నిజాలు ప్రజలకు తెలియాలన్నారు.
Harish Rao | నోటీసులు ఇవ్వలేదు
కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు, తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని హరీశ్‌రావు అన్నారు. ఘోష్ కమిషన్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపించారు. కమిషన్లను పొలిటికల్ వెపన్‌గా వాడుకోవద్దని కోర్టులు గతంలోనే చెప్పాయన్నారు. కాళేశ్వరం కమిషన్ నిబంధనలు అనుసరించలేదనే కోర్టకు వెళ్లామన్నారు. నివేదికను అసెంబ్లీ పెట్టొద్దని హరీశ్‌రావు హైకోర్టులో (High Court) హౌస్ మోషన్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
Harish Rao | చిత్తు కాగితంతో సమానం
కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం ఆదివారం చర్చ పెట్టడం వెనుక కుట్ర ఉందని హరీశ్ రావు విమర్శించారు. కోర్టులో వాదనలు ఉన్నాయనే ఆదివారం చర్చ పెట్టారని ఆరోపించారు. పారదర్శకంగా విచారణ జరగకపోతే కమిషన్ నివేదికలు చిత్తు కాగితంతో సమానమాని గతంలో కోర్టులు చెప్పాయన్నారు. నాడు షా కమిషన్ ఇందిరాగాంధీకి (Indira Gandhi) 8బీ కింద నోటీసులు ఇచ్చిందని హరీశ్‌రావు గుర్తు చేశారు. అయినా ఆమె కోర్టుకు వెళ్తే కమిషన్‌ను కొట్టివేసిందన్నారు.
ఎల్కే అద్వానీ (LK Advani)పై గతంలో కమిషన్ వేస్తే బీజేపీ ధర్నాలు చేసిందన్నారు. ప్రోసీజర్ అనుసరించలేదని అప్పుడు లిబ్రహాన్ కమిషన్‌ను కోర్టు కొట్టేసిందన్నారు. ప్రస్తుతం పీసీ ఘోష్ కమిషన్ కూడా నిబంధనలు పాటించకపోవడంతోనే తాము కోర్టుకు వెళ్లామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత తాను మహారాష్ట్ర వెళ్లానని హరీశ్‌రావు చెప్పారు. తుమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకోలేదన్నారు. దీంతోనే మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించామన్నారు.