More
    HomeజాతీయంGold Price | అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

    Gold Price | అక్షయ తృతీయ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌:Gold Price | ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షం మూడో రోజున అక్షయ తృతీయ(Akshaya Tritiya) నిర్వహిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ నేడు(ఏప్రిల్ 30న) సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజు పసిడి కొనుగోలు చేస్తే మంచిదని భావిస్తుంటారు. బంగారు ఆభరణాలు గానీ, బంగారు నాణేలు గానీ.. ఏది వీలైతే అది కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటుంటారు. ఇలాంటి అతి ప్రాధాన్యమైన రోజున పసిడి ధర(Gold Rate) ఎలా ఉందో తెలుసుకుందాం.

    ఇటీవలే 24 క్యారెట్ల బంగారం తులానికి రూ. లక్షకు చేరుకుంది. అక్షయ తృతీయ సందర్భంగా దాని ధర నేడు రూ. 97,980కి పడిపోయింది. ఇదే సమయంలో, వెండి ధర(Silver Rate) కూడా తగ్గడం విశేషం.

    ఇండియన్ బులియన్ మార్కెట్ (IBJA) ప్రకారం, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.89,810 గా ఉంది. కాగా, మంగళవారం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.89,800గా ఉంది.

    బుధవారం ఉదయం ట్రేడింగ్ సమయంలో, భారత బులియన్ మార్కెట్లో 18 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.73,490గా ఉంది. కాగా, మంగళవారం 18 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.73,400గా ఉంది.

    బుధవారం ఉదయం వెండి ధర కిలోకు రూ.1,00,400 గా నమోదైంది. కాగా, మంగళవారం రూ.1,00,500 గా ఉంది. అంటే కిలోకు రూ. 100 తగ్గింది.

    More like this

    CPM Nizamabad | తెలంగాణ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులు

    అక్షరటుడే, ఇందూరు: CPM Nizamabad | తెలంగాణ సాయిధ పోరాట వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి...

    Team India | టీమిండియాకి కొత్త స్పాన్స‌ర్ వ‌చ్చేశారు.. ఇక నుండి జెర్సీలు ఎలా ఉండ‌నున్నాయంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Team India | భారత క్రికెట్ ప్రేమికులకు తాజా అప్‌డేట్! టీమిండియా క్రికెట్ జెర్సీపై ఇకపై...

    Birkur | గుడి డబ్బులు వడ్డీతో సహా చెల్లిస్తా: బీర్కూర్ మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్

    అక్షరటుడే, బాన్సువాడ: Birkur | బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి (Telangana Tirumala Tirupathi) సంబంధించి రూ.25 లక్షలు...