Homeజిల్లాలునిజామాబాద్​Police Martyrs Day | అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు: డీజీపీ శివధర్​రెడ్డి

Police Martyrs Day | అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు: డీజీపీ శివధర్​రెడ్డి

అమరవీరుల కుటుంబాలకు ఇళ్లస్థలాలను పంపిణీ చేసినట్లు డీజీపీ శివధర్​ రెడ్డి తెలిపారు. నిజామాబాద్​ కమిషనరేట్​ కార్యాలయంలో అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Police Martyrs Day | అమరవీరుల కుటుంబాలకు కొంతకాలంగా పెండింగ్​లో ఉన్న ఇళ్లస్థలాల పంపిణీని నేడు చేసినట్లు డీజీపీ శివధర్​ రెడ్డి (DGP Shivdhar Reddy) అన్నారు. పోలీస్​ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం కమిషనరేట్​ కార్యాలయంలో (Police Commissionerate Office) రూరల్​ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Mla Bhupathireddy), కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డితో (Collector Vinay Krishna Reddy) కలిసి అమరవీరుల కుటుంబాలకు ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1989 నుంచి ఇప్పటివరకు జిల్లాలో 18 మంది పోలీసులు అమరులయ్యారని వివరించారు. వారిలో తొమ్మిది కుటుంబాలకు ఇందల్వాయి (Indalwai) మండలం గన్నారం శివారులో 300 గజాల చొప్పున ఇంటి స్థలాలు అందించడం జరుగుతుందని డీజీపీ వెల్లడించారు. మిగతా తొమ్మిది కుటుంబాలు కూడా ముందుకు వస్తే వారికి సైతం అదే ప్రాంతంలో స్థలాలు అందించడం జరుగుతుందన్నారు.

Police Martyrs Day | ఆసిఫ్​కు హోంగార్డు ఉద్యోగం ఇవ్వాలి

అనేక కేసుల్లో నిందితుడిగా ఉన్న నేరస్థుడు రియాజ్​ను పట్టుకునే ప్రయత్నంలో సారంగపూర్​(Sarangapur) యువకుడు ఆసిఫ్​కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనకు హైదరాబాద్​లోని మల్లారెడ్డి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా.. యువకుడు ఆసిఫ్​కు వీలైతే పోలీసు శాఖలో హోంగార్డు ఉద్యోగం ఇవ్వాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి డీజీపీని కోరారు. ఈ సందర్భంగా డీజీపీ సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే హోంగార్డు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువడనుందన్నారు. అప్పుడు ఉద్యోగం కల్పించేలా కృషి చేస్తామని చెప్పారు.