అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: MLA Sudarshan Reddy | నగరంలోని జర్నలిస్టులందరికీ (journalists) ఇళ్లస్థలాలు మంజూరు చేయిస్తానని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆయనను టీయూడబ్ల్యూజె(ఐజేయూ) తరపున జర్నలిస్టులు మంగళవారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల గురించి ప్రస్తావించారు.
MLA Sudarshan Reddy | దీర్ఘకాలంగా ఉన్న సమస్య..
జర్నలిస్టుల దీర్ఘకాల సమస్య అయిన ఇళ్ల స్థలాల అంశాన్ని సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు. అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలిస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ఆర్డీవోతో ఫోన్లో మాట్లాడి భూ సేకరణ చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఐజేయూ నాయకులు ఎడ్ల సంజీవ్, డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, చింతల గంగాదాస్, రామకృష్ణ, శేఖర్, రాజేష్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.