అక్షరటుడే, మెండోరా: Mendora | దీపం అంటుకుని ఓ ఇంటికి నిప్పంటుకుంది. ఈ ఘటన మెండోరాలో సోమవారం చోటు చేసుకుంది.
రెవెన్యూ ఇన్స్పెక్టర్ (Revenue Inspector) వేణుగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాజారాం ఇంట్లో ఆయన భార్య భార్గవి ఉదయం ఇంట్లో దీపం వెలిగించింది. అనంతరం పనుల నిమిత్తం వారు బయటకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు దీపం కారణంగా ఇంటికి మంటలు అంటుకున్నాయి.
దీంతో ఇంట్లో పొగలు రావడంతో గమనించిన గ్రామస్థులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి మంటలు ఆర్పివేశారు. అయితే అప్పటికే టీవీ, ఫ్రిజ్, బియ్యం బస్తాలు, రూ.15వేల నగదు, ఇతర గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.లక్ష వరకు ఆస్తినష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా బాధితులకు 15 కిలోల రేషన్ బియ్యం (Ration Rice) అందించినట్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.