అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hotstar streaming record : ఈసారి ఐపీఎల్ ఫైనల్(IPL final)లో ఏ జట్టు గెలిచినా కూడా అది చరిత్రే అవుతుంది. ఐపీఎల్ 2025 IPL 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ ఆఖరి పోరు జరుగుతుండగా, తొమ్మిదేళ్ల తర్వాత ఆర్సీబీ, పదకొండేళ్ల తర్వాత పంజాబ్ ఫైనల్‌కు చేరాయి. ఇరు జట్లు 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ ట్రోఫీ కలను నిజం చేసుకోవడానికి గట్టి ఫైట్ చేస్తున్నాయి. క్వాలిఫైయర్ 1లో పంజాబ్‌పై ఆర్సీబీ విజయం సాధించగా, క్వాలిఫైయర్ 2లో ముంబైపై గెలిచి పంజాబ్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలని ఆ రెండు జట్లు 18 సంవత్సరాలు(18 years to kiss the IPL trophy)గా ఎదురుచూస్తూనే ఉన్నాయి.
Hotstar streaming record : హై వ్యూయర్ షిప్
ఒక జట్టేమో తొమ్మిదేళ్ల తర్వాత ఫైనల్స్‌కు చేరుకుంటే.. మరో జట్టు పదకొండేళ్ల తర్వాత ఆఖరి సంగ్రామంలో అడుగుపెట్టింది. ఇద్దరిది ఒకే కల.. ఆ నిరీక్షణకు నేడు ముగింపు పడనుంది. ఎవరు గెలిచినా మరొకరికి హార్ట్ బ్రేక్ మాత్రం తప్పదు. మోస్ట్ ఎగ్జైటింగ్ మ్యాచ్ కావడంతో స్టేడియంకే కాకుండా బ్రాడ్ కాస్టింగ్ స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో HoT Star ఫైనల్ మ్యాచ్‌ని చాలా మంది వీక్షిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్-18 (ఐపీఎల్)Indian Premier League-18 (IPL) ఫైనల్ మ్యాచ్‌లో వెబ్ ప్లాట్‌ఫామ్ హాట్ స్టార్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌ను ఒకే సమయంలో 35.1 కోట్ల గాడ్జెట్స్ లైవ్‌లో ఉన్నాయి. అంటే అంతకు మించి వీక్షకులు చూస్తున్నారు. ఇది ఒక రికార్డుగా చెప్పవచ్చు.
ఐపీఎల్ ట్రోఫీ(IPL trophy)ని ముద్దాడాలనేది ఈ రెండు జట్ల పద్దెనిమిదేళ్ల కల. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఆ కల నెరవేరబోతోంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌ని స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించొచ్చు. సీజన్ ఆరంభం నుంచి ఆర్సీబీ, పంజాబ్ పోటాపోటీ విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ PSPK మొదటి స్థానంలో నిలిస్తే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానంలో ముగించింది. అయితే టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆర్సీబీ దూకుడుగానే ఆడుతుండగా, ఈ జట్టు 9 వికెట్లు కోల్పొయి 190 పరుగులు చేసింది.