- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిCI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులతో హాస్టల్​ వాచ్​మన్​ ఆత్మహత్య

CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులతో హాస్టల్​ వాచ్​మన్​ ఆత్మహత్య

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: CI Chandrasekhar Reddy | ఆర్థిక ఇబ్బందులు, తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలతో బాయ్స్ హాస్టల్ వాచ్​మన్​ (Watchman)ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కామారెడ్డి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి (CI Chandrasekhar Reddy) తెలిపిన వివరాల ప్రకారం..దోమకొండ (domakonda) మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన శివాయపల్లి కార్తీక్ (23) కొన్నిరోజులుగా నుండి కామారెడ్డి పట్టణంలోని ఓ కళాశాల బాయ్స్ హాస్టల్​లో (Boys Hostel) వాచ్​మన్​గా పనిచేస్తున్నాడు. అయితే అతని కుటుంబ ఆర్థిక సమస్యలు, తల్లి తండ్రుల ఆరోగ్యం బాగా లేని కారణంగా మనసులో బాధపడుతుండేవాడు. బుధవారం ఉదయం హాస్టల్ వెనకాల మామిడి చెట్టుకు ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. మృతుడి తండ్రి బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News