HomeUncategorizedPlane Crash | మెడిక‌ల్ హాస్ట‌ల్ బిల్డింగ్‌ను ఢీకొన్న విమానం.. పలువురు మెడికోలు మృతి

Plane Crash | మెడిక‌ల్ హాస్ట‌ల్ బిల్డింగ్‌ను ఢీకొన్న విమానం.. పలువురు మెడికోలు మృతి

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Plane Crash | గుజరాత్‌లోని అహ్మదాబాద్‌(Ahmedabad)లో గురువారం నాడు జ‌రిగిన ఎయిర్ ఇండియా విమాన ప్ర‌మాదం అందరిని కలిచి వేస్తోంది. 230 మంది ప్రయాణికులు, 12 మంది ఎయిర్ లైన్స్ సిబ్బందితో కూడిన విమానం టేకాఫ్ అయిన కొద్ది క్ష‌ణాల‌లోనే కుప్ప‌కూలింది. ప్రయాణికులలో భారతీయులు 169 మంది ఉండగా.. మిగిలిన వారు బ్రిటిష్, కెనడా, పోర్చుగీస్ పౌరులు ఉన్నారు. టేకాఫ్‌ అయిన త‌ర్వాత ఎయిర్‌పోర్టు(Airport)కు స‌మీపంలోని సివిల్ ఆస్పత్రి వ‌ద్ద బీజే మెడిక‌ల్ కాలేజీ హాస్టల్(medical college hostel) భ‌వ‌నంపై విమానం కుప్పకూలింది. దీంతో అక్కడ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.

Plane Crash | పెద్ద ప్ర‌మాదం..

హాస్టల్‌ భవనాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది మెడికోలు మరణించినట్లు సమాచారం. అంతేకాదు, ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని పలు భవనాలు కూడా దెబ్బతిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. మనకు ప్రాణం పోసే డాక్టర్లే వారికి ఏమాత్రం ప్రమేయం లేని ఘటనలో చనిపోవడం అందరినీ కలిచివేస్తోంది. మెడికోల మృతిపై ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. ఎయిర్ ఇండియా (Air India) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ ద్వారా విమాన ప్రమాదం సమాచారాన్ని అందించింది. బోయింగ్ 787-7 విమానంలో ప్రయాణిస్తున్న వారిలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం 1.38 నిమిషాలకు విమానం బయలుదేరిందని ఎయిర్ ఇండియా(Air India) తెలిపింది.

ఈ విమానం పైల‌ట్​గా సుమిత్ స‌బ‌ర్వాల్(Pilot Sumit Sabharwal), విమానానికి ఫ‌స్ట్ ఆఫీస‌ర్‌గా పైల‌ట్ క్లైవ్ కుంద‌ర్ ఉన్నారు. సుమిత్ స‌బ‌ర్వాల్‌కు 8,200 గంట‌ల పాటు విమానం న‌డిపిన అనుభ‌వం ఉంది. కోపైల‌ట్‌కు 1,100 గంట‌ల‌కు విమానం న‌డిపిన అనుభ‌వం ఉంది. కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌(Gujarat CM Bhupendra Patel)తో అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున అన్ని విధాలా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు.