అక్షరటుడే, కామారెడ్డి: kamareddy | ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతులు లేకుండా మహిళలకు అబార్షన్లు చేస్తే సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి విద్య (Medical Officer Dr. Vidya) హెచ్చరించారు. జిల్లా వైద్యాధికారి కార్యాలయంలో శుక్రవారం గైనకాలజిస్టులు, పీడియాట్రిస్ట్లు, రేడియాలజిస్టులతో జిల్లాస్థాయి ఎంటీపీ (మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) సమీక్ష సమావేశం నిర్వహించారు.
kamareddy | నిబంధనలకు విరుద్ధంగా..
ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి విద్య మాట్లాడుతూ.. ప్రైవేట్ ఆస్పత్రుల్లో (private hospitals) ఎంటీపీ అమలు, నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. జిల్లా కార్యాలయం నుంచి ప్రత్యేక అనుమతి లేకుండా ఏ ప్రైవేట్ ఆస్పత్రి కూడా ఎంటీపీ ప్రక్రియను నిర్వహించరాదని స్పష్టం చేశారు. అలాంటి పనులు చేస్తే ఆస్పత్రి సీజ్ చేయడమే కాకుండా పర్మినెంట్గా మూసివేస్తామని హెచ్చరించారు. జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం ఎంటీపీల నిర్వహణకు ముందు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని ఆదేశించారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎమీమ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.