బాన్సువాడ, అక్షరటుడే: Banswada | పెండింగ్లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని బాన్సువాడ ఏరియా ఆస్పత్రిలో (Banswada Area Hospital) కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆస్పత్రిలోని సానిటేషన్, పేషెంట్ కేర్ (Patient Care), సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్న కార్మికులు గురువారం ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. నాలుగు నెలలుగా వేతనాలు బకాయి చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
దసరా, దీపావళి (Deepawali) పండుగల వేళ కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని, అప్పులు చేసి రోజువారీ ఖర్చులు వెళ్లదీసుకుంటున్నామని వారు తెలిపారు. తమకు వేతనాలు ఇవ్వకపోతే విధులు ఎలా నిర్వహించగలమని కార్మికులు ప్రశ్నించారు. ప్రభుత్వం, కాంట్రాక్ట్ ఏజెన్సీ తక్షణమే బకాయిలు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.