Homeజిల్లాలునిజామాబాద్​Collector Nizamabad | ఆస్పత్రుల పనితీరును మరింత మెరుగుపర్చాలి

Collector Nizamabad | ఆస్పత్రుల పనితీరును మరింత మెరుగుపర్చాలి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Collector Nizamabad | ప్రభుత్వాస్పత్రుల పనితీరు మరింతగా మెరుగుపడాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy)సూచించారు. గురువారం కలెక్టరేట్​లో ఆస్పత్రులపై సమీక్ష నిర్వహించారు. బోధన్ (Bodhan) పట్టణంలోని జిల్లా ఆస్పత్రితో పాటు ఆర్మూర్, భీమ్​గల్(Bheemgal), ధర్పల్లి ఏరియా హాస్పిటల్, డిచ్​పల్లి, వర్ని, మోర్తాడ్, కమ్మర్​పల్లి, నవీపేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో వైద్యులు, సిబ్బంది, ఖాళీలు తదితర అంశాలపై చర్చించారు.

ఖాళీల భర్తీ కోసం ఉన్నతాధికారులకు పంపిన ప్రతిపాదనలను పరిశీలించారు. రెగ్యులర్, కాంట్రాక్టు ప్రాతిపదికన ఆయా ఆస్పత్రుల్లో కొనసాగుతున్న సివిల్ సర్జన్లు, డిప్యూటీ సివిల్ సర్జన్లు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ల గురించి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.

రెగ్యులర్ పోస్టుల నియామకం జరిగే వరకు కాంట్రాక్ట్​ ప్రాతిపదికన వైద్యుల నియామకాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తూ ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకాన్ని పెంచాలని తెలిపారు. అలాగే వర్ని, ధర్పల్లి తదితర ప్రాంతాల్లో నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రుల భవన నిర్మాణాల పనులు వేగంగా జరిగేలా చూడాలని ఆదేశించారు. సమావేశంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్, అదనపు కలెక్టర్ అంకిత్, డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.