అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Madhya Pradesh | మనుషులే కాదు జంతువులు కూడా కొన్ని సందర్భాలలో భీకరమైన ఫైటింగ్ చేస్తుండడం మనం చూస్తూనే ఉంటాం. ఈ సందర్భంలో అవి గాయపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు మధ్యప్రదేశ్(Madhya Pradesh) రాష్ట్రం జబల్‌పూర్ నగరంలో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకోగా, ఇది అందరిని ఆశ్చర్యపరిచింది. నగరంలోని రద్దీగా ఉండే నాగరత్‌చౌక్ వద్ద నడిరోడ్డుపై రెండు గుర్రాలు ఊహించని రీతిలో ఒక్కసారిగా ఘర్షణకు దిగాయి. వీటి బల ప్రదర్శనతో చుట్టూ ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.
Madhya Pradesh | ఎందుకంత ఆగ్రహం..
గుర్రాలు రెచ్చిపోయిన తీరును చూస్తే సినిమా సన్నివేశాలనే తలపించాయి. మొదట ఒక షోరూమ్‌లోకి చొరబడి అక్కడ గ్లాస్‌లు పగులగొట్టి విధ్వంసం సృష్టించాయి. తర్వాత రోడ్డుపైకి వచ్చి, పక్కనే వెళ్తున్న ఒక ఆటోలోకి ఒక్కసారిగా ఒక గుర్రం దూకేసింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారు షాక్‌కు గురయ్యారు. ఆ గుర్రం ఆటోలో (Auto Rikshaw) ఇరుక్కుపోయి అల్లకల్లోలం సృష్టించింది. దాదాపు 20 నిమిషాలపాటు అది అక్కడే చిక్కుకుని నానా తంటాలు పడింది. స్థానికులు, ఓపికగా ప్రయత్నించి చివరికి దాన్ని బయటకు తీశారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయాలు తక్కువ స్థాయిలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మరియు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గుర్రాలు(Horses) ఎందుకు ఆగ్రహంతో తలపడ్డాయో తెలియదు. వాటికి ఏమైనా గాయం అయిందా? ఎవరైనా వాటికి హాని తలపెట్టే ప్రయత్నం చేశారా? అనే కోణాల్లో స్థానిక పోలీసులు(Madhya Pradesh Police) దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా గుర్రాలు చాలా కూల్‌గా కనిపిస్తూ ఉంటాయి. మనకు చాలా సందర్భాలలో సేవకులుగా పనులు చక్కబెడుతుంటాయి. అలాంటిది ఒక్కసారిగా ఆ రెండు గుర్రాలు బీభత్సం సృష్టించడానికి కారణం ఏంటా అనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. ఏది ఏమైనా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది.
Horse Gets Stuck in Auto-Rickshaw While Fighting With Another, Injures 2 People Sitting Inside At Jabalpur’s Nagarth Square#madhyapradesh #jabalpur #Auto pic.twitter.com/tPdsZBy4GS
— Free Press Madhya Pradesh (@FreePressMP) July 23, 2025