అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bangladesh | బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు ఆగడం లేదు. గత కొద్ది రోజులుగా దుండగులు హిందువులను హతమార్చస్తున్నారు. తాజాగా మరో హిందూ వ్యాపారిని హత్య చేశారు. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై దుండగులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హతమార్చినట్లు సమాచారం. రాణాప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు (Journalist) హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Bangladesh | అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో..
బంగ్లాదేశ్‌లోని నర్సింగ్డి జిల్లా (Narsingdi District)లో అత్యంత రద్దీగా ఉండే చార్‌సిందూర్ బజార్ (Charsindur Bazaar). ఇంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ హత్య జరగడం గమనార్హం. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్‌లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నట్లు సమాచారం. కాగా.. సోమవారం రాత్రి షాపు ఉండగా.. దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే మణి ప్రాణాలు కోల్పోయాడు.
Bangladesh | బాధ్యులను శిక్షించాలని డిమాండ్
మణి చక్రవర్తి మంచి వ్యాపారి అని, అతనికి ఎవరితోనూ చిన్నచిన్న విభేదాలు కూడా లేవని తోటి వ్యాపారులు చెబుతున్నారు. కాగా.. బంగ్లాలో తరచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Bangladesh | 20 రోజుల్లో ఆరుగురి హత్య
బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య గురవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. కాగా.. అప్పటి నుంచి అక్కడ హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా హిందువులపై దాడులు కొనసాగుతున్నాయి. ఫ్యాక్టరీ కార్మికుడు దీపు చంద్రదాస్ అనే ఫ్యాక్టరీ కార్మికుడి నడిరోడ్డు చెట్టుకు వేలాడదీసి తగలబెట్టిన ఘటనం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇలా గత 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.