అక్షరటుడే, వెబ్‌డెస్క్: Horoscope today | జ్యోతిష్య శాస్త్రం astrology ప్రకారం 16.10.2025 నాడు 3 రాశుల వారు ఆర్థికంగా లాభాలు పొందుతారు. ఇంకొన్ని రాశులు వ్యాపారాలు మొదలుపెడతారు.
మేష రాశి Aries: ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉన్నాకానీ మీ ప్రవర్తన కారణంగా ఆశించిన విధంగా జరగకపోవచ్చు. బంధువులతో ఎక్కువ సమయం గడుపుతారు.
ఉద్యోగులు Employees తమ సహోద్యోగులతో ప్రశంసించబడతారు. అలాగే వారి ప్రోత్సాహం పొందుతారు. ఇవాళ గతంలో వదిలేసిన పనులను పూర్తి చేస్తారు.
భాగస్వామితో ఎలాంటి తగాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు. ఆర్థికంగా ఎదగడానికి రావి చెట్టు వేర్లపై నూనె పోయాలి.
వృషభ రాశి Taurus: ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దీని వలన కొంత ఒత్తిడికి లోనవుతారు. ఆర్థిక పరంగా లాభం పొందుతారు.సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోడానికి ఇదే మంచి సమయం.
ఇతరులు ఏమైనా దూషించినట్లు మాట్లాడినా అంతగా పట్టించుకోరు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. ఇవాళ ఇంట్లో గంగా జలం చల్లాలి.
మిథున రాశి Gemini: ఆశ ఎక్కువగా ఉన్నా నిర్లక్ష్యం కారణంగా వ్యాపారంలో ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది.మీ పిల్లల నుండి కొత్త విషయాలను నేర్చుకుంటారు. లక్ష్యాన్ని సాధించడానికి దృఢ సంకల్పం పెట్టుకోవాలి.
ఖాళీ సమయాన్ని వినియోగించుకుని నిజాయితీగా కష్టపడి పని చేస్తారు. గతంలో పూర్తి చేయని పనులని ఇవాళ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇవాళ రోటీ లేదా బ్రెడ్‌ని పక్షులకు ఆహారంగా వేయాలి.
కర్కాటక రాశి Cancer: ఇవాళ ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది. మీరు అప్పు తీసుకున్న వ్యక్తికి తన డబ్బులను తిరిగి ఇస్తారు. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఆనందదాయకంగా ఉంటుంది.
గతం తాలూకూ స్నేహితులు కలిసి పాత విషయాలను గుర్తుకు చేసుకుని చిరస్మరణీయమైనా రోజుగా మారుస్తారు. హనుమాన్ ఆలయంలో బాదం పప్పులు నైవేద్యం పెట్టి, అందులో సగం ఇంటికి తీసుకువచ్చి లాకర్‌లో ఉంచాలి.
సింహ రాశి Leo: ధ్యానం,యోగా చేయాలి. విద్యార్ధులు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలా చేస్తారు.
ఇవాళ కృషి వలన మీకు మంచి ఫలితాలను పొందుతారు. క్రీడలలో పాల్గొంటారు.ఇతరులతో ఎక్కువ సమయం గడపకూడదు. ఇవాళ పసుపు కలిపిన పాలను తాగాలి.
కన్య రాశి Virgo: పనిలో ఒత్తిడి వలన ఏకాగ్రతకు భంగం కలుగుతుంది. ఇంట్లో అన్ని ఖర్చులను ఇంటి పెద్ద భరిస్తారు. తెలివిగా ఆలోచించి కొత్త మార్గాలు ఎన్నుకుంటారు.
వ్యాపారం చేసే వారు తమ ఆలోచనలు ఎవరితోను పంచుకోకూడదు. దీని వలన ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆకుపచ్చ దారంతో చుట్టబడిన నాణెం ధరించడం శుభప్రదం.
తుల రాశి Libra: ఇవాళ కలిగే ఆందోళన వలన మీ ఆలోచన శక్తి తగ్గిపోతుంది. గతంలో చేసిన అనవసర ఖర్చుల వలన ఆర్థికంగా ఇబ్బంది పడతారు. ఇవాళ ఇతరులను ఆకట్టుకునే విధంగా ఉంటారు.
వైవాహిక జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల వలన మీరు ఆశించిన దాని కంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇవాళ ఓం ఘృణి సూర్యాయ నమః అని జపిస్తూ ఉదయిస్తున్న సూర్యుడికి నమస్కారం చేయాలి.
వృశ్చిక రాశి Scorpio: సాధువు ఆశీస్సులు తీసుకోవడం వలన మనశ్శాంతిని పొందుతారు. ఇవాళ మీ సోదరుడు లేదా సోదరి సహాయంతో ప్రయోజనాలు పొందుతారు.
ఇంట్లో పరిస్థితుల కారణంగా కలత చెందుతారు. ఆలోచనతో నిర్ణయాలను తీసుకోవడం వలన మంచి ప్రతి ఫలాలు వస్తాయి. ఇవాళ బియ్యం, చక్కెర, పాలు వంటి వాటిని దానం చేయాలి.
ధనుస్సు రాశి Sagittarius: బంధువుల రాకతో ఇంట్లో ఏర్పడిన ఉద్రిక్తత తగ్గి ఉపశమనం కలుగుతంది. గతంలో పెట్టిన పెట్టుబడుల వలన ఆదాయం పెరుగుతుంది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తిచేస్తారు.
ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇది ఆహ్లాదకరంగా ఉండేలా చేస్తుంది. వ్యాపారం అభివృద్ధికి ఇంట్లో ప్రధాన ద్వారం నుంచి స్వచ్చమైన గాలి ప్రసరించేలా చూసుకోవాలి.
మకర రాశి Capricorn: శారీరక లాభాల కోసం ధ్యానం,యోగా సాధన చేయాలి. ఇవాళ ఆహ్వానించబడని అతిథి ఇంట్లోకి రావచ్చు. వారి రాక మీకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుస్తుంది.
పనిలో కొంత మార్పును చూస్తారు. మీకు నచ్చిన పనులను చేయడానికి ఇష్టపడతారు. మీ పాత స్నేహితులను కలిసి గతంలో జరిగిన అనుభవాలను పంచుకుంటారు. ఇవాళ ఎక్కువగా ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి.
కుంభ రాశి Aquarius: ప్రయాణాలకు దూరంగా ఉండాలి. వ్యాపారానికి పెట్టుబడులను పెట్టడం వలన మంచి ఫలితాలు పొందుతారు. ఇవాళ ప్రశాంతంగా ఉంటారు.
ఎక్కువగా బయటి వాతావరణంలో ఉండేందుకు ఇష్టపడతారు. మీరు ద్వేషించే వ్యక్తితో మాట్లాడటం వలన అద్భుతాలు చూస్తారు. ఇవాళ గోధుమ పిండిని చేపలకు ఆహారంగా వేయాలి.
మీన రాశి Pisces: Horoscope today | తినే, తాగే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ఇవాళ డబ్బు కోల్పోయే అవకాశం ఉంది. ఎవరితో అయినా లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
ప్రముఖ వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. సహోద్యోగులు మీ మాటను గౌరవిస్తారు. రోజువారి ఆహారంలో బెల్లం, పప్పు ధాన్యాలను తీసుకోవాలి.