Homeబిజినెస్​Stock Markets | వాణిజ్య చర్చలపై ఆశలు.. 82 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

Stock Markets | వాణిజ్య చర్చలపై ఆశలు.. 82 వేల మార్క్‌ను దాటిన సెన్సెక్స్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Markets | యూఎస్‌తో ట్రేడ్‌ డీల్‌(Trade deal) విషయమై జరుగుతున్న చర్చలు ఇన్వెస్టర్లలో ఆశలు పెంచాయి. దీంతో కనిష్టాల వద్ద కొనుగోళ్లతో సూచీలు పరుగులు తీశాయి. సెన్సెక్స్‌ మరోసారి 82 వేల మార్క్‌ను దాటి నిలబడిరది. నిఫ్టీ సైతం 25,200 పాయింట్లపైకి చేరింది.

యూఎస్‌ ఎఫ్‌వోఎంసీ మీటింగ్‌ (US FOMC meeting)బుధవారం ముగియనుంది. ఇందులో ఫెడ్‌ వడ్డీ రేట్లను కనీసం 25 బేసిస్‌ పాయింట్ల మేర తగ్గించే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని మార్కెట్‌ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లలో పాజిటివ్‌ సెంటిమెంట్‌ బలపడుతోంది. రూపాయి విలువ బలపడడం, గ్లోబల్‌ మార్కెట్లు సైతం పాజిటివ్‌గా ఉండడం మన మార్కెట్లపై ప్రభావం చూపాయి.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సెన్సెక్స్‌(Sensex) 67 పాయింట్లు, నిఫ్టీ 4 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత పుంజుకుని పైపైకి వెళ్లాయి. సెన్సెక్స్‌ 81,779 నుంచి 82,443 పాయింట్ల మధ్యలో, నిఫ్టీ(Nifty) 25,070 నుంచి 25,261 పాయింట్ల మధ్యలో ట్రేడ్‌్‌ అయ్యాయి. చివరికి సెన్సెక్స్‌ 594 పాయింట్ల లాభంతో 82,380 వద్ద, నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 25,239 వద్ద్ద స్థిరపడ్డాయి.

Stock Markets | ఎఫ్‌ఎంసీజీ మినహా..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఎఫ్‌ఎంసీజీ(FMCG), క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌లు మినహా మిగిలిన అన్ని రంగాల ఇండెక్స్‌లు లాభాల బాటలో పయనించాయి. బీఎస్‌ఈలో సర్వీసెస్‌ ఇండెక్స్‌(Services Index) 1.67 శాతం, టెలికాం 1.50 శాతం, ఆటో ఇండెక్స్‌ 1.43 శాతం, ఇన్‌ఫ్రా 1.07 శాతం, రియాలిటీ 1.02 శాతం పెరగ్గా.. కమోడిటీ 0.90 శాతం, యుటిలిటీ 0.87 శాతం, క్యాపిటల్‌ గూడ్స్‌ 0.89 శాతం, మెటల్‌ 0.88 శాతం, పవర్‌ 0.84 శాతం, ఐటీ 0.81 శాతం, బ్యాంకెక్స్‌ 0.77 శాతం, ఎనర్జీ 0.73 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్‌ 0.57 శాతం లాభపడ్డాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్‌ 0.10 శాతం, క్యాపిటల్‌ మార్కెట్‌ ఇండెక్స్‌ 0.09 శాతం నష్టపోయాయి. లార్జ్‌క్యాప్‌(Large cap) ఇండెక్స్‌ 0.67 శాతం, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.66 శాతం, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 0.62 శాతం పెరిగాయి.

Stock Markets | అడ్వాన్సెస్‌ అండ్‌ డిక్లయిన్స్‌..

బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,507 కంపెనీలు లాభపడగా 1,606 స్టాక్స్‌ నష్టపోయాయి. 196 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 155 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 55 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 9 కంపెనీలు అప్పర్‌ సర్క్యూట్‌ను, 7 కంపెనీలు లోయర్‌ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 2.50 లక్షల కోట్లు పెరిగింది.

Stock Markets | Top gainers..

బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 28 కంపెనీలు లాభాలతో ఉండగా.. 2 మాత్రమే నష్టాలతో ముగిశాయి.
కోటక్‌ బ్యాంక్‌ 2.64 శాతం, ఎల్‌టీ 2.28 శాతం, ఎంఅండ్‌ఎం 2.22 శాతం, మారుతి 1.99 శాతం, ఎయిర్‌టెల్‌ 1.88 శాతం లాభపడ్డాయి.

Stock Markets | Losers..

ఆసియా పెయింట్‌ 0.87 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 0.69 శాతం నష్టపోయాయి.

Must Read
Related News