- Advertisement -
Homeజిల్లాలుకామారెడ్డిChinnakodapgal Society | సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులకు సన్మానం

Chinnakodapgal Society | సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులకు సన్మానం

- Advertisement -

అక్షరటుడే, నిజాంసాగర్: Chinnakodapgal Society | చిన్నకొడప్​గల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు జార నాగిరెడ్డి, హన్మాండ్లును పెద్ద కొడప్​గల్ మండలం (Peddakodapgal Mandal) కాటేపల్లి (Katepally) గ్రామస్థులు శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మల్లప్ప పటేల్ మాట్లాడుతూ.. దీర్ఘకాలిక రుణాల వసూళ్లలో చిన్న కొడప్​గల్ సొసైటీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచి అవార్డు సొంతం చేసుకుందన్నారు. ఈ సందర్భంగా సొసైటి అధ్యక్ష, కార్యదర్శులను అభినందించారు.

Chinnakodapgal Society | రైతులకు అందుబాటులో ఉంటూ..

రైతులకు అందుబాటులో ఉంటూ, రుణ గ్రహీతలకు అవగాహన కల్పించి సమయానికి అప్పులు చెల్లించేలా కృషి చేస్తున్నారని అన్నారు. అలాగే రైతులకు సకాలంలో పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందిస్తున్నారని, మరెన్నో సేవలు అందించాలని ఆకాంక్షించారు. అనంతరం సహకార వారోత్సవాల్లో భాగంగా కాటేపల్లి గోదాం ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సింగిల్ విండో ఉపాధ్యక్షుడు గంగాగౌడ్ , జీపి కార్యదర్శి ప్రదీప్, డైరెక్టర్లు పెంటయ్య, సాయిలు, రైతులు శంకర్, చాంద్ పాషా, రమేష్, రవీందర్, మొగులయ్య, సొసైటి సిబ్బంది రమేష్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News