అక్షరటుడే, ఎల్లారెడ్డి : Teachers | మండలంలోని ఆదర్శ పాఠశాల (Model School)లో సోమవారం ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
ఆర్డీవో పార్థ సింహారెడ్డి, ఎంఈవో రాజులు హాజరై మాట్లాడారు. విద్యార్థుల అభ్యున్నతికి పాటుపడేది ఉపాధ్యాయులేనన్నారు. అనంతరం శాలువాతో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో గెజిటెడ్ హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు సురేష్ గౌడ్, రాధిక, సాంగ్య, గులాం శాకీర్, సావయి సింగ్, శివకుమార్, విజయ్ కుమార్, వినయ్ కుమార్, గాంధీ, స్రవంతి పాల్గొన్నారు.