అక్షరటుడే, బోధన్: Bodhan Market Committee | బోధన్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్గా ఏరాజ్పల్లికి చెందిన వసంత్రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలను పరిష్కరించే దిశగా మార్కెట్ కమిటీ కృషి చేస్తుందన్నారు. ఆయనను సన్మానించిన వారిలో డీసీసీ అధికార ప్రతినిధి గంగాశంకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ శీల శంకర్ తదితరులున్నారు.