Hong Kong fire accident | ప్రపంచంలోనే అతిపెద్ద అగ్ని ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన హాంకాంగ్ విపత్తు మానవాళిని వణికిస్తోంది. ప్రతి గంట గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతుండటం, రక్షణ చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి ఎంత భయానకంగా మారిందో చూపిస్తోంది.
హాంకాంగ్‌ను Hongkong భారీ విషాదం కుదిపేసింది. తైపో జిల్లాలోని వాంగ్ ఫు కోర్ట్ హౌసింగ్ ఎస్టేట్‌లో సంభవించిన అగ్నిప్రమాదం భారీ ప్రాణనష్టం మిగిల్చింది. ఎనిమిది భవనాలతో ఉన్న ఈ పెద్ద అపార్ట్మెంట్ సముదాయం ఒక్కసారిగా మంటల్లో చిక్కుకోవడంతో ప్రాంతం మొత్తాన్ని భయాందోళనలకు గురి చేసింది. ఇప్పటి వరకు లభించిన సమాచారం ప్రకారం 44 మంది మృతిచెందగా, 279 మంది అదృశ్యమయ్యారు. దాదాపు 4,600 మంది నివాసితుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి, ఇది ఈ ఘటనతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.
Hong Kong fire accident | భారీ అగ్ని ప్రమాదం..
మంటలు మొదలై 13 గంటలు గడిచినా అగ్నికీలలు అదుపులోకి రావడం లేదు. పొగ, అగ్ని కీలలు భవనాలన్నింటినీ చుట్టుముట్టడంతో రక్షణ చర్యలు తీవ్ర కష్టతరమయ్యాయి. సుమారు 700 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే, రక్షణ కార్యకలాపాల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బందిలోని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో Hospital చికిత్స పొందుతున్నారు. మంటలు ఎలా చెలరేగాయి? ఎందుకు అంత వేగంగా వ్యాపించాయి? అనేది ఇంకా స్పష్టత రాలేదు. ఈ ప్రమాదం పై హాంకాంగ్ ప్రభుత్వం అత్యవసర దర్యాప్తును ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.51 నిమిషాలకు అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. దీన్ని నం.5 అలారంగా అక్కడి అధికారులు ప్రకటించారు. ఈ ప్రకటన అత్యవర పరిస్థితిలో ఉంటుంది. ఆ సమయంలో భారీ స్థాయిలో ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని మోహరించాల్సి ఉంటుంది. భవనాలు Buildings అన్నీ దగ్గర దగ్గరగానే ఉండడంతో మిగతా వాటికి కూడా వేగంగా మంటలు వ్యాపించడం జరిగింది. మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవిస్తే..రాత్రి వరకు మంటలు అదుపులోకి రాలేదు. 128 ఫైరింజన్లతో సహాయ చర్యలు చేపట్టినట్టు తెలుస్తుండగా, 57 అంబులెన్స్‌లు ఘటనాస్థలంలో మోహరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.