ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Home Minister Anitha | కారు కింద ప‌డిన వ్య‌క్తిని లాగి ముళ్లపొద‌ల్లో ప‌డేశారు.. జ‌గన్‌పై...

    Home Minister Anitha | కారు కింద ప‌డిన వ్య‌క్తిని లాగి ముళ్లపొద‌ల్లో ప‌డేశారు.. జ‌గన్‌పై హోం మినిస్ట‌ర్ ఫైర్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Home Ministe Anitha | గ‌త కొద్ది రోజులుగా ఏపీ రాజ‌కీయాలు (AP Politics) చాలా వాడివేడిగా సాగుతున్నాయి. పల్నాడు జిల్లాలో (Palnadu district) సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటన విష‌యంలో జ‌గ‌న్‌పై ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఘ‌ట‌నకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy) ట్వీట్ చేయ‌గా, దానిపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత (state Home Minister Vangalapudi Anith) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతల ప్రవర్తన దారుణంగా దిగజారిపోయిందని ఆమె మండిపడ్డారు. జగన్ వ్యాఖ్యలు సమాజంలో హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని, రాజకీయ నాయకుల మాటలను ప్రజలు నిశితంగా గమనిస్తారని అన్నారు.

    Home Minister Anitha | అనిత ఆగ్రహం

    ‘సొంత పార్టీ కార్యకర్త వాహనం కింద పడితే పట్టించుకోకపోవడం అత్యంత దారుణమైన విషయం. గాయపడిన వ్యక్తిని కనికరం లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారు. ఆ వ్యక్తిని సకాలంలో ఆస్పత్రికి (hospital) తరలించి ఉంటే బహుశా ప్రాణాలు నిలిచేవేమో. జగన్‌కు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా? మనుషుల ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేదా? ఇద్దరు వ్యక్తులు మరణించినప్పటికీ జగన్‌ Ys Jagan తన పర్యటనను యథావిధిగా కొనసాగించారు’ అని మంత్రి అనిత (Minister Anitha) ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో సత్యసాయి జిల్లాకు (Sathya Sai district) వెళ్లినప్పుడు కూడా అక్కడ రచ్చ రచ్చ చేశారు. పొదిలి వెళ్లినప్పుడు మహిళలు, పోలీసులపై (Police) రాళ్ల దాడికి పాల్పడ్డారు. రెంటపాళ్లకు వెళ్లినప్పుడు కూడా పోలీసులు ఎంత చెప్పినా వినకుండా వ్యవహరించారు.

    ఇరవై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి పరామర్శకు ఎలా వెళ్లాలో తెలియదా? కేవలం బలప్రదర్శన చేయడానికే జగన్ బయటకు వస్తున్నట్లు కనిపిస్తోంది. ‘రప్పా రప్పా’ (Rappa Rappa) అంటే తప్పేంటని అడగడం ఆయన మానసిక స్థితికి అద్దం పడుతోంది అని’ అనిత విమర్శించారు. మ‌రోవైపు జగన్మోహన్ రెడ్డికి కల్పిస్తున్న జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత (Z Plus category security) విషయంలో ఎలాంటి లోటుపాట్లు లేవని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆయన భద్రతకు సంబంధించి చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఆయనకు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా రోజూ ఆయన వద్దకు వెళ్తుందని, అయితే, జగన్ ఆ వాహనాన్ని (Vehicle) ఉపయోగించకుండా తన సొంత వాహనంలోనే ప్రయాణిస్తున్నారని మంత్రి వివరించారు. కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక చేత్తో గొడ్డలి, మరో చేత్తో పార్టీ జెండా పట్టుకుని రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని, ఇలాంటి వారిని జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నారని హోంమంత్రి అనిత ఆరోపించారు.

    Latest articles

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 16 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...

    alcohol with volcanic ash | అగ్నిపర్వతాల బూడిదతో మద్యం తయారీ.. తాగారా దీనిని..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: alcohol with volcanic ash : అంతర్జాతీయ బ్రాండ్​ ఆల్కహాల్​ (international brand alcohol) కోసం...

    More like this

    Today Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Today Panchangam : తేదీ(DATE) – 16 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama...

    Rajagopal Reddy | మరోసారి సీఎం రేవంత్​ను టార్గెట్ చేసిన మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్!

    అక్షరటుడే, హైదరాబాద్: Rajagopal Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్...

    Heavy rain in Hyderabad | హైదరాబాద్​లో దంచికొడుతున్న వాన.. ఆ ప్రాంతాల్లో కుంభవృష్టి

    అక్షరటుడే, హైదరాబాద్: Heavy rain in Hyderabad : బుధ, గురువారాల్లో భారీ వర్షాలు (Heavy Rain) ఉంటాయని...