అక్షరటుడే, వెబ్‌డెస్క్: Minister Amit Shah | రాజకీయాల నుంచి వైదొలిగిన తర్వాత వేదాలు, ఉపషనిత్తులు, ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేస్తూ జీవిత చరమాంకాన్ని గడిపేస్తానని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) వెల్లడించారు.
సహకార మంత్రిత్వ శాఖ నాలుగో వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా భారత పాల కేంద్రంగా పేరొందిన గుజరాత్లోని ఆనంద్ పట్టణంలో వివిధ రాష్ట్రాల సహకార కార్మికుల మహిళలతో బుధవారం నిర్వహించిన ‘సహకార్ సంవాద్’ కార్యక్రమంలో (‘Sahakar Samvad’ program) ఆయన మాట్లాడుతూ.. తన పదవీ విరమణ ప్రణాళికలను వివరించారు. “పదవీ విరమణ తర్వాత నాకు కొన్ని ప్రణాళికలున్నాయి. వేదాలు, ఉపనిషత్తులు, సహజ వ్యవసాయం అధ్యయనం చేయడానికి జీవితాన్ని అంకితం చేయాలని నిర్ణయించుకున్నాను” అని వెల్లడించారు.
Minister Amit Shah | తూర్పు జోనల్ భేటీలో పాల్గొననున్న షా..
జూలై 10న రాంచీలో జరిగే తూర్పు జోనల్ కౌన్సిల్ సమావేశానికి (Eastern Zonal Council meeting) షా అధ్యక్షత వహించనున్నారు. ఇందులో నాలుగు తూర్పు రాష్ట్రాలైన జార్ఖండ్, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి దాదాపు 70 మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సమావేశం దృష్ట్యా రాంచీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Minister Amit Shah | వంతెన ప్రమాదంపై షా దిగ్భ్రాంతి
గుజరాత్లోని వడోదర జిల్లాలో గంభీర వంతెన కూలిపోవడంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah) తీవ్ర విచారం వ్యక్తం చేశారు, ప్రమాద స్థలంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం రక్షణ, సహాయ చర్యలను ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. “గుజరాత్లోని వడోదర జిల్లాలో జరిగిన ప్రమాదం చాలా విషాదకరం. ఎన్డీఆర్ ఎఫ్ బృందం సహాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉంది. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను” అని షా అన్నారు.