Homeజిల్లాలునిజామాబాద్​CP sai chaitanya | హోంగార్డులకు ఉలెన్​ జాకెట్స్​ అందజేత

CP sai chaitanya | హోంగార్డులకు ఉలెన్​ జాకెట్స్​ అందజేత

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: CP sai chaitanya | నగరంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులకు (Home Guards) సీసీ సాయి చైతన్య ఉలెన్​ జాకెట్స్ (Woolen jackets)​ అందజేశారు. శుక్రవారం సీపీ కార్యాలయంలో వీటిని అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. వర్షాకాలం, రాబోయే చలికాలంలో హోంగార్డులకు ఉలెన్​ జాకెట్స్​ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని సూచించారు.

పోలీసులు వీటిని విధి నిర్వహణలో తప్పనిసరిగా వినియోగించుకోవాలన్నారు. నిజామాబాద్​ మొత్తంగా 369 మంది హోంగార్డులకు వీటిని అందజేశామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో హోంగార్డ్స్ విభాగం (Home Guards Division) ఇన్​ఛార్జి రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ సతీష్, వెల్ఫేర్ విభాగం రిజర్వ్ ఇన్​స్పెక్టర్​ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.