Kamareddy SP
Kamareddy SP |వరదల సమయంలో హోంగార్డుల సేవలు మరువలేనివి: ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | జిల్లాను వరదలు ముంచెత్తిన సమయంలో హోంగార్డుల సేవలు మరువలేనివని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) హోంగార్డులను (Home Guards) ప్రశంసించారు. జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో పోలీసు సిబ్బందితో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గతంలో లేని విధంగా కామారెడ్డి జిల్లాలో (Kamareddy district) వరదలు ముంచెత్తాయన్నారు.

ఆ సమయంలో పోలీస్ సిబ్బంది ప్రజలకు అండగా నిలిచారన్నారు. ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు సాహసం చేశారని కొనియాడారు. ఇదే స్ఫూర్తి మున్ముందు కొనసాగించాలని సూచించారు. నిజాయితీతో పనిచేసిన వారికి గుర్తింపు, గౌరవం ఎప్పుడు లభిస్తుందని, గుర్తింపుతో పాటు ఉత్తమ పనితీరుకు రివార్డులు లభిస్తాయని తెలిపారు. అనంతరం వర్షాల నేపథ్యంలో హోంగార్డులకు రెయిన్ కోట్స్, జెర్సీలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.