Homeజిల్లాలుకామారెడ్డిhome guard suspension | విధులకు డుమ్మా కొడుతున్న హోంగార్డుపై సస్పెన్షన్​ వేటు

home guard suspension | విధులకు డుమ్మా కొడుతున్న హోంగార్డుపై సస్పెన్షన్​ వేటు

అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న హోంగార్డుపై వేటు పడింది. హోంగార్డును సస్పెండ్​ చేస్తూ కామారెడ్డి ఎస్పీ రాజేష్​ చంద్ర శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: home guard suspension | అనధికారికంగా విధులకు గైర్హాజరవుతున్న హోంగార్డుపై (Home Guard) సస్పెన్షన్​ వేటు పడింది. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా హోంగార్డు కార్యాలయంలో (Home Guard Office) విధులు నిర్వర్తిస్తున్న హోంగార్డు హెచ్.రవి జులై 30 నుంచి విధులకు గైర్హాజరవుతున్నాడు.

అధికారికంగా ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరవుతున్నాడన్న రిపోర్ట్ ఎస్పీకి చేరింది. దాంతో ఆయనను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తూ అనుమతి లేకుండా గైర్హాజరవుతున్న సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ప్రజల భద్రత, పోలీసు శాఖ (Kamareddy Police) ప్రతిష్టకు విఘాతం కలిగించినా.. నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ప్రతి అధికారి తమ బాధ్యతలను నిబద్ధత, క్రమశిక్షణతో నిర్వర్తించాలని చెప్పారు.