ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Sri Kapileswara Swamy Temple | జూలై 6 నుంచి తిరుపతి కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

    Sri Kapileswara Swamy Temple | జూలై 6 నుంచి తిరుపతి కపిలేశ్వరాలయంలో పవిత్రోత్సవాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​:Sri Kapileswara Swamy Temple | తిరుపతి(Tirupati)లోని శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో జూలై 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం జూలై 6న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.

    Sri Kapileswara Swamy Temple | పవిత్రోత్సవాలు ఎందుకు నిర్వహిస్తారంటే..

    ఆలయంలో ఏడాది పొడవునా జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం(Shaivagama Shastram) ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు.

    Sri Kapileswara Swamy Temple | మూడు రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాలు

    ఉత్సవాల్లో భాగంగా జూలై 7న మొద‌టిరోజు ఉదయం ఉత్స‌వ‌మూర్తుల‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. సాయంత్రం క‌ల‌శ‌పూజ‌, హోమం, ప‌విత్ర ప్ర‌తిష్ఠ చేస్తారు.

    8న రెండో రోజు ఉద‌యం గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌ ఉంటుంది. అలాగే ‌సాయంత్రం యాగ‌శాల‌పూజ‌, హోమం చేప‌డ‌తారు.

    9న ఉద‌యం మ‌హాపూర్ణాహుతి(Mahapurnahuti), క‌ల‌శోధ్వాస‌న‌(Kalashodhwasana), ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ నిర్వ‌హించనున్నారు. ఇక ‌సాయంత్రం 6 గంట‌ల‌కు పంచమూర్తులైన కపిలేశ్వరస్వామి, కామాక్షి అమ్మవారు, విఘ్నేశ్వరస్వామి, సుబ్రమణ్యస్వామి, చండికేశ్వరస్వామి వార్ల మూర్తులతో పుర వీధుల్లో ఊరేగించనున్నారు. ఈ సందర్భంగా భక్తులు(Devotees) అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.

    More like this

    Yellareddy | అటవీ భూముల పరిశీలన

    అక్షర టుడే, ఎల్లారెడ్డి : Yellareddy | మండలంలోని వెల్లుట్ల(Vellutla) శివారులోని హేమగిరి ప్రాంతంలో గల అటవీ భూములను...

    KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: KALOJI | తెలంగాణ బతుకుకు వన్నెతెచ్చిన కవి కాళోజీ అని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల...

    Vice President Election | ముగిసిన ఉప రాష్ట్రపతి ఎన్నిక.. 96 శాతం పోలింగ్.. ఓటేసిన అధికార, విపక్ష ఎంపీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President Election | ఉప రాష్ట్రపతి ఎన్నిక ముగిసింది. మంగళవారం ఉదయం 10...