అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hollywood Actress | హాలీవుడ్ నటి జాక్ పాట్ కొట్టేసింది. సినిమాలో నటించడానికి ఏకంగా రూ. 530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ అందిపుచ్చుకుంది. ఆమె ఎవరో కాదు హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీ (Hollywood actress Sydney Sweeney). 27 ఏళ్ల ఈ ముద్దుగుమ్మ త్వరలో బాలీవుడ్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
భారతదేశంలోని అత్యంత ఖరీదైన చిత్ర ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఓ సినిమాలో నటించడానికి నిర్మాతలు ఆమెను సంప్రదించారని, రూ. 530 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ (remuneration) ఆఫర్ చేశారని తెలిసింది. దేశంలో పేరేన్నికగన్న ఒక నిర్మాణ సంస్థ తమ తదుపరి చిత్రంలో నటించడానికి స్వీనికి రూ. 530 కోట్ల ఒప్పందాన్ని ప్రతిపాదించింది. తాము నిర్మించనున్న చిత్రానికి అంతర్జాతీయంగా గుర్తింపు తీసుకురావడానికే నిర్మాతలు సిడ్నీ స్వీనిని సంప్రదించినట్లు తెలిసింది. ఆమెకు ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు.
Hollywood Actress | భారతీయ ప్రేమకథాచిత్రమ్
నిర్దిష్ట ప్రణాళికల మేరకు ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే ఒక ప్రముఖ భారతీయ నటుడితో ప్రేమలో పడే ఒక అమెరికన్ స్టార్ (American star) పాత్రను స్వీనీ పోషిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించనున్న ఈ సినిమాను న్యూయార్క్, పారిస్, లండన్, దుబాయ్ అనేక అంతర్జాతీయ ప్రదేశాలలో చిత్రీకరించనున్నారు. 2026 ప్రారంభంలో సినిమా సెట్‌పైకి వెళ్లే అవకాశముంది.
Hollywood Actress | ఆఫర్ ఒప్పుకున్న నటి
భారీ ఆఫర్‌ను చూసి స్వీనీ ‘ఆశ్చర్యపోయారని’, అయితే, ప్రాజెక్ట్ స్థాయి చూసి నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని వార్తాసంస్థ ‘ది సన్’ వెల్లడించింది. ప్రస్తుతానికి ప్రాజెక్టుపై ఇంకా సైన్ చేయనప్పటికీ, భారతదేశంలో చిత్ర పరిశ్రమ (film industry) మెరుపు వేగంతో అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రాజెక్ట్ తన నిర్మాణాలను ప్రపంచ వేదికపై ప్రదర్శించాలని లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొంది. ప్రస్తుతానికి, స్వీనీ బృందం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Hollywood Actress | సిడ్నీ స్వీనీ కెరీర్
యుఫోరియా, ది వైట్ లోటస్ చిత్రాలలో తన అద్భుతమైన పాత్రలతో స్వీనీ మెస్మరైజ్ చేసింది. హాలీవుడ్లో (Hollywood) అత్యంత డిమాండ్ ఉన్న యువ తారలలో ఒకరిగా మారింది. ఆమె తదుపరి క్రిస్టీలో కనిపించనుంది. స్పోర్ట్స్ ఇల్లస్ట్రేటెడ్ కవర్‌పై కనిపించిన మొదటి మహిళా ఫైటర్, ప్రొఫెషనల్ బాక్సర్ క్రిస్టీ మార్టిన్ (boxer Christy Martin) పాత్రను పోషిస్తోంది. బెన్ ఫోస్టర్, మెరిట్ వెవర్ నటించిన ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. ప్రస్తుతం, స్వీని పాల్ ఫీగ్ దర్శకత్వం వహించిన ది హౌస్మెయిడ్ అనే థ్రిల్లర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో అమండా సెయ్ ఫ్రెడ్ కూడా నటించారు. ఇది ఫ్రీడా మెక్ఫాడెన్ రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందుతోంది.
