అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market Holidays | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)కు అక్టోబర్ నెలలో ఎక్కువ సెలవులు ఉండబోతున్నాయి.
ఏకంగా 11 సెషన్లపాటు ట్రేడింగ్ ఉండదు. ఎందుకంటే దసరా, దీపావళి ఇదే నెలలో రానున్నాయి. అలాగే బలిప్రతిపద సందర్భంగా స్టాక్ మార్కెట్(Stock Market)కు సెలవు ఉంటుంది. కాగా దీపావళి పండుగను కొన్ని ప్రాంతాలలో 20వ తేదీన జరుపుకోనుండగా.. మరికొన్ని ప్రాంతాలలో 21న నిర్వహించుకోనున్నారు. అయితే స్టాక్ మార్కెట్ క్యాలెండర్ ప్రకారం 21వ తేదీన దీపావళి సెలవు ఉండనుంది.
Stock Market Holidays | ముహూరత్ ట్రేడింగ్ ఎప్పుడంటే?
అక్టోబర్ 21 న దీపావళి(Diwali) సందర్భంగా సాధారణ ట్రేడింగ్ ఉండదు. అయితే ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తారు. ముహూరత్ ట్రేడింగ్‌కు సంబంధించిన వేళలను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్‌ఎస్‌ఈ) ప్రకటించింది. ఈ ట్రేడింగ్ సెషన్ దీపావళి రోజు మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 వరకు గంటపాటు జరుగుతుంది. ప్రీ ఓపెనింగ్ సెషన్ మధ్యాహ్నం 1.30 నుంచి 1.45 వరకు ఉంటుంది. ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వంటి విభాగాల్లో ట్రేడింగ్ జరుగుతుందని ఎన్‌ఎస్‌ఈ స్పష్టం చేసింది. సాధారణంగా ముహూరత్ ట్రేడింగ్(Muhurat Trading)ను దీపావళి రోజు సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు నిర్వహిస్తారు. ఈసారి మధ్యాహ్నం నిర్వహించాలని నిర్ణయించారు.
Stock Market Holidays | ఎక్కువసార్లు లాభాల్లోనే..
భారత్‌లో కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు దీపావళిని శుభదినంగా భావిస్తారు. ముహూరత్ ట్రేడింగ్‌లో పాల్గొనడం వల్ల సంవత్సరం మొత్తం శుభాలు జరుగుతాయని ఇన్వెస్టర్లు నమ్ముతారు. అయితే ట్రేడింగ్ గంట పాటే ఉండడంతో మార్కెట్‌లో వొలటాలిటీ కనిపించొచ్చు. ముహూరత్ ట్రేడింగ్ ఎక్కువగా పాజిటివ్‌గానే ముగుస్తుంది. గత 16 ఏళ్లలో 13 సార్లు గ్రీన్‌లోనే ముగియడం గమనార్హం.
సెలవుల వివరాలు..
- అక్టోబర్ 2 : దసరా, గాంధీ జయంతి
- అక్టోబర్ 4 : శనివారం
- అక్టోబర్ 5 : ఆదివారం
- అక్టోబర్ 11 : శనివారం
- అక్టోబర్ 12 : ఆదివారం
- అక్టోబర్ 18 : శనివారం
- అక్టోబర్ 19 : ఆదివారం
- అక్టోబర్ 21 : దీపావళి
- అక్టోబర్ 22 : బలిప్రతిపద
- అక్టోబర్ 25 : శనివారం
- అక్టోబర్ 26 : ఆదివారం