Homeజిల్లాలుకామారెడ్డిkamareddy | కామారెడ్డి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

kamareddy | కామారెడ్డి జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: kamareddy | కామారెడ్డి జిల్లాను భారీ వర్షాలు తీవ్రంగా అతలాకుతం చేస్తున్నాయి. మంగళవారం రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం పడుతోంది. కుండపోత వర్షాలు కురుస్తుండడంతో నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

నిజాంసాగర్​ గేట్లు ఎత్తి భారీగా నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక పోచారం ప్రాజెక్టు చరిత్ర అత్యంత ఎక్కువ వరద నీరు ఇన్​ఫ్లోగా వస్తోంది. 1.40 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టుపై నుంచి పొంగిపొర్లుతోంది. ఇక అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. భిక్కనూరు మండలంలో రైల్వే ట్రాక్​ కొట్టుకుపోయింది. దీంతో ప్రజలు కాలు బయటపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అంతేకాకుండా రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కామారెడ్డి జిల్లాకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. దీంతో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్​ ఆదేశాల మేరకు గురువారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు.