Homeజిల్లాలుకామారెడ్డిSchools Holiday | కుండపోత వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

Schools Holiday | కుండపోత వర్షాలు.. విద్యాసంస్థలకు సెలవు

- Advertisement -

అక్షరటుడే ఇందూరు: Schools Holiday | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ నిజామాబాద్​, కామారెడ్డి జిల్లాలకు రెడ్​ అలర్ట్​ ప్రకటించింది. రెండు జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి జిల్లాను జలవిలయం అంతలాకుతలం చేస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వర్షాలు కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి. నదులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో రెండు జిల్లాల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Schools Holiday | సూళ్లకు సెలవు

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నేడు సెలవు ప్రకటిస్తూ బుధవారం కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నిజామాబాద్​ జిల్లాలోనూ బుధవారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం పడుతుండడంతో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సూచనల మేరకు గురువారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ మేరకు ఉత్వర్వులు జారీ చేశారు.