అక్షరటుడే, ఇందూరు: Best Teacher Award | ఉపాధ్యాయుల దినోత్సవాన్ని (Teachers Day) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాత్రి విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఉత్తర్వులు జారీ చేశారు. దీంట్లో భాగంగా నగరంలోని బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడు శంకర్ రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా (State level Best teacher award) ఎంపికయ్యారు.
బోర్గాం జెడ్పీహెచ్‌లో విధులు నిర్వహిస్తున్న శంకర్ 1997లో సామాన్యశాస్త్రంలో స్కూల్ అసిస్టెంట్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి రామన్నపేట్, పెర్కిట్, ఎర్గట్ల, ఎడపల్లి, హొన్నాజీపేట్ పాఠశాలల్లో పనిచేశారు. ప్రస్తుతం బోర్గాం(పి) స్కూల్లో హెచ్ఎంగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Best Teacher Award | రెండేళ్లలో ఒకటి,రెండు సెలవులు మాత్రమే తీసుకుని..
బోర్గాం(పి) జెడ్పీహెచ్ఎస్లో (Borgam(P) ZPHS) హెచ్ఎంగా పనిచేస్తున్న శంకర్ గత రెండేళ్లుగా కేవలం ఒకటి, రెండు లీవులు మాత్రమే తీసుకుని మిగితా సమయాన్ని పాఠశాలకే కేటాయించడం విశేషంగా చెప్పుకోవచ్చు. ఎక్కడ పనిచేసినా నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేస్తూ శంకర్ అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం శంకర్ మాట్లాడుతూ.. బోర్గాం(పి) జెడ్పీహెచ్‌ఎస్‌ను అభివృద్ధి చేసేందుకు తోటి ఉపాధ్యాయులు సహకరిస్తున్నారని.. తనకు అవార్డు రావడంలో తోటి ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉందన్నారు. అలాగే హెచ్ఎం శంకర్‌కు ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు రావడంతో తోటి ఉపాధ్యాయులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.