అక్షరటుడే, హైదరాబాద్: HIT to sub-inspector | డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు చేపడుతున్న ఎస్సై పైకి మందుబాబు కారును దూకించి తీవ్రంగా గాయపర్చాడు. ఈ ఘటన హైదరాబాద్లోని యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
HIT to sub-inspector | సుమారు 400 మీటర్లు ఈడ్చుకెళ్లి..
యాచారం ఠాణా పరిధిలో ఎస్సై మధు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారున. కాగా, ఓ కారును ఆపేందుకు ప్రయత్నించిన ఎస్సై పైకి మందుబాబు దూకించాడు. దీంతో ఎస్సై కారు బానెట్ పై ఒక్కసారిగా పడిపోయారు. కానీ, సదరు మందుబాబు కారును ఆపకుండా దాదాపు 400 మీటర్ల వరకు వాహనాన్ని అలాగే తీసుకెళ్లినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా, ఆ తర్వాత కారు కాస్త స్లో చేయగానే ఎస్సై పక్కకు దూకేశారు. కాగా, ఈ ప్రమాదంలో ఎస్సై తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా.. కారు బానెట్ పై ఎస్సై ఉండాగానే యాచారం అంబేద్కర్ Ambedkar చౌరస్తాలో సదరు వాహనం.. ఓ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఓ యువతి చేయి విరిగింది. మొత్తానికి ఇబ్రహీంపట్నం వద్ద మందుబాబు drunk driver కారును పోలీసులు అపి, డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు.