HomeUncategorizedHit 3 | ఇట్స్ అఫీషియ‌ల్.. ఓటీటీలో హిట్ 3 స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచి అంటే..

Hit 3 | ఇట్స్ అఫీషియ‌ల్.. ఓటీటీలో హిట్ 3 స్ట్రీమింగ్ ఎప్ప‌టి నుంచి అంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hit 3 | నేచుర‌ల్ స్టార్ నాని(Natural Star Nani) ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్ సంపాదించుకుంటున్నాడు. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 ఇలా మంచి ప్రాజెక్టులతో నాని Nani హిట్లు కొడుతున్నాడు. ఇక ఇప్పుడు నాని అయితే శ్రీకాంత్ ఓదెలతో మరింత రా అండ్ రస్టిక్ ‘ది ప్యారడైజ్’ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇక ఫుల్ స్వింగ్‌లో జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటే సుజిత్ మూవీని కూడా నాని స్టార్ట్ చేసేలా ఉన్నాడు. సుజిత్ ఒకసారి ఆ ఓజీ మూవీని ఫినిష్ చేసుకుని వస్తే రెండు ప్రాజెక్టుల్ని నాని ఒకే సారి పట్టాలెక్కించేలా ఉన్నాడు. పైగా శ్రీకాంత్ ఓదెల వచ్చే ఏడాది చిరంజీవి సినిమా మీదకు షిఫ్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఆ మూవీని నాని సమర్పిస్తున్న విషయం విదితమే.

Hit 3 | ఓటీటీలో..

నాని, శైలేష్ కొలను కాంబోలో హిట్ 3 చిత్రం మే 1న వచ్చిన సంగతి తెలిసిందే. హిట్ 3(Hit 3)కి మిక్స్​డ్​ టాక్ వచ్చింది. టాక్‌తో సంబంధం లేకుండా హిట్ 3 సినిమాకు మంచి కలెక్షన్లు అయితే వచ్చాయి. పోస్టర్లతో రూ.వంద కోట్లు దాటేసింది. మరి డిస్ట్రిబ్యూటర్ అయితే తనకు అంత లాభాలు రాలేదని చెప్పుకొచ్చాడు. అలా మరోసారి కలెక్షన్లు, పోస్టర్ల మీద చర్చలు జరిగాయి. ఇక ఇవన్నీ ఇలా ఉంటే హిట్ 3 (Hit 3) ఇప్పుడు ఓటీటీలోకి వచ్చే టైం అయ్యింది. హిట్ 3 రిలీజ్ అయిన నాలుగు వారాలకు ఓటీటీలో రాబోతోంది. మే 29 నుంచి ఈ సినిమాను నెట్​ఫ్లిక్స్‌(Netflix) స్ట్రీమింగ్ చేయబోతోంది.

దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 ఇలా మంచి ప్రాజెక్టులతో నాని హిట్లు కొడుతున్నాడు. ఇక ఇప్పుడు నాని అయితే శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో మరింత రా అండ్ రస్టిక్ ‘ది ప్యారడైజ్’ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఇక ఫుల్ స్వింగ్‌లో జరగనుంది. ఈ ప్రాజెక్ట్‌తో పాటే సుజిత్ మూవీని కూడా నాని స్టార్ట్ చేసేలా ఉన్నాడు. సుజిత్(Sujeeth) ఒకసారి ఆ ఓజీ మూవీని ఫినిష్ చేసుకుని వస్తే రెండు ప్రాజెక్టుల్ని నాని ఒకేసారి పట్టాలెక్కించేలా ఉన్నాడు. పైగా శ్రీకాంత్ ఓదెల వచ్చే ఏడాది చిరంజీవి సినిమా మీదకు షిఫ్ట్ కానున్న సంగతి తెలిసిందే. ఆ మూవీని నాని సమర్పిస్తున్న విషయం విదితమే. మొత్తానికి ఇప్పుడు నాని హ‌వా న‌డుస్తుందనే చెప్పాలి.