HomeUncategorizedHit 3 Movie review | హిట్ 3 మూవీ రివ్యూ.. నాని ఖాతాలో మ‌రో...

Hit 3 Movie review | హిట్ 3 మూవీ రివ్యూ.. నాని ఖాతాలో మ‌రో హిట్ ప‌డ్డ‌ట్టేనా..?

- Advertisement -

Akshara Today Movie Desk: 

మూవీ : హిట్ 3 hit 3 movie
నటీనటులు: నాని hero nani, శ్రీనిథి శెట్టి shrinithi shetti, రావు రమేష్ rao ramesh, సూర్య శ్రీనివాస్, శ్రీనాథ్ మాగంటి, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం: మిక్కీ జే మేయర్ mikky j meyor
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గేసే
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
నిర్మాత: నాని, ప్రశాంతి త్రిపురనేని
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: డా. శైలేష్ కొలను

నాని హీరోగా(Hero Nani) శైలేష్ కొలను(Director Shailesh) తీసిన చిత్రం హిట్ 3(Hit 3)కాగా, ఇందులో నానికి జోడిగా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పైగా హిట్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆసక్తి పెరిగిపోయింది. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం స‌క్సెస్ సాధించిందా?

కథ: అర్జున్ సర్కార్ (నాని) రూత్ లెస్ కాప్ కాగా, అత‌ను 100 మంది అమాయకులు చచ్చినా పర్లేదు గానీ ఒక్క క్రిమినల్ మాత్రం బతక్కూడదు అని అనుకుంటాడు. ఎవ‌రైన త‌న చేతికి దొరికారో ఆ క్రిమిన‌ల్స్‌కి న‌ర‌కం చూపిస్తూ ఉంటాడు. ఒక సైకో కిల్ల‌ర్(Psycho Killer) వ‌రుస హ‌త్య‌లు చేస్తూ పోలీసుల‌కి స‌వాల్ విసురుతూ ఉంటాడు. ఆ స‌మ‌యంలో అర్జున్ సర్కార్ ఎంట‌ర్ అయి ఇన్వెస్టిగేష‌న్(Investigation) మొద‌లు పెడ‌తాడు. అయితే ఆ స‌మ‌యంలో సైకోకి సంబంధించిన అనేక విష‌యాలు తెలుస్తాయి. అవేంటో తెలియాలంటే హిట్ 3 చూడాల్సిందే.

Hit 3 Movie review | నటీనటుల ప‌ర్‌ఫార్మెన్స్

నాని న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏ పాత్ర‌లో అయిన ఒదిగిపోతారు. ఇప్పుడు అర్జున్ స‌ర్కార్‌గా కూడా విశ్వ‌రూపం చూపించాడు. శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) కూడా త‌న పాత్ర‌తో అల‌రించింది. యాక్ష‌న్ సీన్స్(Action scenes) అద‌ర‌గొట్టింది. శ్రీనాథ్ మాగంటి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. రావు రమేష్ క్యారెక్టర్ బాగుంది. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

Hit 3 Movie review | టెక్నికల్ టీం ప‌నితీరు

మ‌నం ముందుగా మాట్లాడుకోవాల్సింది మిక్కీ జే మేయర్ (Mickey Jay Meyer) సంగీతం గురించి. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగా సెట్ అయింది. సాను జాన్ వర్గేసే సినిమాటోగ్రఫీ బాగుంది. జమ్మూ కాశ్మీర్‌తో పాటు అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్లేసెస్ బాగా చూపించారు. సైంధవ్‌తో నిరాశ పరిచిన శైలేష్ కొలను ఈసారి మాత్రం పకడ్బందీగా క‌థ రాసుకున్నాడు కథ. ముఖ్యంగా హిట్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ వాడుకొని సెకండాఫ్ సినిమాకు కీలకంగా మార్చేసాడు.

ప్ల‌స్ పాయింట్స్

ద‌ర్శ‌క‌త్వం
నాని న‌ట‌న‌
మిక్కీ జే మేయ‌ర్ సంగీతం

మైన‌స్ పాయింట్స్

కొన్ని చోట్ల స్లో నరేష‌న్

విశ్లేషణ‌: అర్జున్ సర్కార్ ఇంట్రో నుంచే మనోడి క్యారెక్టరైజేషన్ పక్కాగా ఎస్టిబ్లిష్ చేసాడు శైలేష్. క్రిమినల్స్‌తో ఆయన వ్య‌వ‌హ‌రించే తీరు గుబులు పెట్టించింది. హీరో చేస్తున్న పనులను ఆయన ప్రవచనాలకు ముడిపెట్టిన తీరు బాగుంది. ఓ వైపు సీరియస్ ట్రాక్ నడుస్తున్నపుడే.. మధ్య మధ్యలో నాని, శ్రీనిథి మధ్య సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా చివరి 40 నిమిషాలు అయితే నెక్ట్స్ లెవల్.

హిట్ 1, 2 కేసులతో ఈ సినిమాను ముడిపెట్టిన విధానం ఆకట్టుకుంటుంది. సైకోను పట్టుకునే సీన్స్ అన్నీ చాలా అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా ట్విస్టులు అలరిస్తాయి. సింపుల్ కథనే చాలా మలుపులు ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు శైలేష్. క్లైమాక్స్‌లో నాని యాక్షన్ సీక్వెన్సులు చూస్తే భయమేస్తుంది. హిట్ 3లో నాని క్యారెక్టరైజేషన్ పిల్లలకు వ‌ణుకు పుట్టిస్తుంది. మొత్తానికి ఈ చిత్రం అబ్‌కీ బార్ అర్జున్ సర్కార్..! అని చెప్ప‌వ‌చ్చు.

రేటింగ్ 3/5