అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నిర్మించిన ధర్మశాస్త్ర అయ్యప్ప ఆలయ (Ayyappa temple) అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని జపాన్ శాస్త్రవేత్త, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి అన్నారు.
అయ్యప్ప ఆలయంలో వివిధ పనులకు ఆయన భూమి పూజచేసి, మొదటి విడతగా రూ.50వేలు ఆలయ కమిటీ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్‌కు అందజేశారు. అన్నదాన కార్యక్రమానికి కూడా తన తోడ్పాటు ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. అనంతరం అన్నప్రసాద వితరణ (Annaprasadam distribution) కార్యక్రమంలో పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములకు స్వయంగా వడ్డించారు.
కార్యక్రమంలో ఆలయ కమిటీ ఛైర్మన్ పద్మ శ్రీకాంత్, వైస్ ఛైర్మన్ కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజేందర్ నాథ్, ప్రతినిధులు గురుస్వామి చంద్రం, ఆకుల కిష్టయ్య, పప్పు వెంకటేశం, ప్యాలాల రాములు, నవీన్, బీజేపీ మండలాధ్యక్షుడు నర్సింలు, బీజేపీ సీనియర్ నేతలు దేవేందర్, బాలకిషన్, రాజేశ్వర్, కాశీనాథ్, ప్రసాద్, అల్లం పండరి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.

