అక్షరటుడే, లింగంపేట: Yellareddy | లింగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (Lingampeta Primary Health Center) వైద్యురాలు హిమబిందు సోమవారం ఎల్లారెడ్డి డిప్యూటీ డీఎంహెచ్వోగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు డీఎంహెచ్వో చంద్రశేఖర్ (DMHO Chandrasekhar) ఆమెకు నియామక పత్రాన్ని అందజేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. రోగులకు వైద్యసేవలు అందేవిధంగా తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా లింగంపేట ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది ఆమెను శాలువతో సత్కరించారు. కార్యక్రమంలో ఫరీదా, రమేశ్, యాదగిరి, ప్రదీప్, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు.
