Homeబిజినెస్​Highway Infrastructure IPO | రికార్డు సృష్టించిన హైవే ఇన్ర్‌ఫా.. లిస్టింగ్‌తోనే 64 శాతం లాభాలు

Highway Infrastructure IPO | రికార్డు సృష్టించిన హైవే ఇన్ర్‌ఫా.. లిస్టింగ్‌తోనే 64 శాతం లాభాలు

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Highway Infrastructure IPO | హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (Highway Infrastructure ltd) ఐపీవో అదరగొట్టింది. లిస్టింగ్‌తోనే 64 శాతం లాభాలను అందించింది. తద్వారా ఈ ఏడాది అత్యధిక ప్రీమియంతో లిస్టయిన కంపెనీగా నిలిచింది.

టోల్ వసూలు, EPC కేంద్రీకృత సంస్థ అయిన హైవే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(HIL) మార్కెట్‌నుంచి రూ. 130 కోట్లు సమీకరించేందుకోసం ఐపీవో(IPO)కు వచ్చింది. ఈనెల 5 నుంచి 7 వరకు సబ్‌స్క్రిప్షన్‌ స్వీకరించారు. చిన్న ఐపీవో కావడం, జీఎంపీ భారీగా ఉండడంతో దీనికి భారీ స్పందన లభించింది. మొత్తంగా 316.64 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబ్‌(Subscribe) కాగా.. రిటైల్‌ కోటా 164 రెట్లు సబ్‌స్క్రైబ్‌ అయ్యింది. ఈ కంపెనీ షేర్లు మంగళవారం మార్కెట్‌లోకి ఎం‍ట్రీ ఇచ్చాయి. ఇష్యూ ధర గరిష్ట ప్రైస్‌ బాండ్‌ వద్ద రూ.70 కాగా.. రూ. 115 వద్ద ఎన్‌ఎస్‌ఈ(NSE)లో లిస్టయ్యింది. ఐపీవో అలాట్‌ అయినవారికి లిస్టింగ్‌ సమయంలోనే 64 శాతానికిపైగా లాభాలు వచ్చాయి. ఆ తర్వాత కూడా వెనక్కి తగ్గలేదు. రూ. 120.75 వద్ద అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. అంటే తొలిరోజే ఐపీవో ఇన్వెస్టర్లకు 72.50 శాతం లాభాలు వచ్చాయన్న మాట.

ఇటీవల లిస్టయిన ఆదిత్య ఇన్ఫోటెక్‌(Aditya infotech) లిమిటెడ్‌ 51 శాతం ‍ప్రారంభ లాభాలను ఇచ్చింది. జీఎన్జీ ఎలక్ట్రానిక్స్‌(GNG electronics) లిమిటెడ్‌ సుమారు 50 శాతం లాభాలను అందించింది. ఈ రెండు కంపెనీలు సైతం పక్షం వ్యవధిలోనే లిస్టవడం గమనార్హం.