ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​New courses in degree | ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం.. డిగ్రీలో కొత్త...

    New courses in degree | ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం.. డిగ్రీలో కొత్త కోర్సులు!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: New courses in degree : డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశ పెట్టాలని తెలంగాణ ఉన్నత విద్యా మండలి (Telangana Higher Education Council) భావిస్తోంది. బీఏ డిఫెన్స్ సైన్స్ సెక్యూరిటీ(BA Defense Science Security)తో సహా 18 కోర్సులు తీసుకురావాలని చూస్తోంది. మొదట ఎంపిక చేసిన కాలేజీల్లో వీటిని అమలు చేసి, తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలనేది యోచన.

    కాగా, డిగ్రీలో కామన్ సిలబస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. సబ్జెక్టుల వారీగా 30 నుంచి 40 ప్రశ్నలతో కూడిన మెటీరియల్​ను విద్యార్థులకు అందజేయాలని అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ విధానం సైతం వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    డిగ్రీతో పాటు జేఎన్టీయూ(JNTU) సిలబస్​లోనూ మార్పులు తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నత విద్యామండలి(Council of Higher Education) ఉన్నట్లు సమాచారం. పరిశోధన సంస్కృతిని మరింత ప్రోత్సహించేలా సిలబస్ రూపొందించాలని చూస్తోంది. పరిశోధనలు ఎక్కువగా జరిగితేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని ఆ వైపునకు మొగ్గు చూపుతున్నట్టు సమాచారం.

    జేఎన్టీయూ(JNTU)లో ప్రతి మూడేళ్లకోసారి సిలబస్‌ మార్చడం ఆనవాయితీగా ఉంది. ఆర్‌-22 పేరుతో మూడేళ్ల క్రితం సిలబస్‌ను మార్చారు. ఆ సిలబస్‌ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆర్‌-25 పేరుతో మరో కొత్త సిలబస్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

    ఇంటర్న్‌ షిప్‌, కోర్సు పూర్తికాగానే ఉద్యోగం, ఉపాధి కల్పించే అత్యుత్తమ సిలబస్‌ను రూపొందించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. యూజీసీ(UGC) ఆమోదంతో డిగ్రీలో మొత్తం 18 కొత్త కోర్సులను ఉన్నత విద్యా మండలి తీసుకురానుంది.

    More like this

    Care Degree College | 12న కేర్ డిగ్రీ కళాశాలలో రిక్రూట్ మెంట్ డ్రైవ్

    అక్షరటుడే, ఇందూరు: Care Degree College | నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఈనెల 12న రిక్రూట్ మెంట్...

    Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శిని బదిలీ చేయొద్దు

    అక్షరటుడే, బోధన్: Bodhan | బోధన్ సహకార సంఘం కార్యదర్శి ఉమాకాంత్ బదిలీ ఉత్తర్వులు నిలిపేసి యధాస్థానంలో కొనసాగించాలని...

    Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలు

    అక్షరటుడే, బాల్కొండ: Balkonda | డ్రంక్​ అండ్​ డ్రైవ్​లో ఇద్దరికి జైలుశిక్ష విధిస్తూ ఆర్మూర్​ న్యాయస్థానం తీర్పునిచ్చింది. వివరాల్లోకి...