అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gachibowli | హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలిలో హైటెన్షన్ నెలకొంది. ఓ స్టార్ హోటల్‌పై 50 మంది దాడి చేశారు.
గచ్చిబౌలిలోని హోటల్ థార్ తంగరిన్ (Hotel Thar Tangerine)పై బుధవారం ఉదయం కొంతమంది దాడి చేశారు.
హోటల్లోకి చొరబడి ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. బస చేసిన అతిథులను బలవంతంగా గదుల నుంచి ఖాళీ చేయించారు. దీంతో వారు ప్రాణభయంతో రోడ్డుపైకి వచ్చారు. లీజుదారుడికి, బిల్డింగ్ యజమానికి మధ్య వివాదమే దాడికి కారణమని సమాచారం. హోటల్ సిబ్బంది (Hotel Staff)పై సైతం దాడి చేశారు.
Gachibowli | నిర్వాహకుల ఆగ్రహం
దాడిపై హోటల్ నిర్వాహకులు (Hotel Management) ఆగ్రహం వ్యక్తం చేశారు. లీజు గడువు అయిపోతే కోర్టులు చూసుకోవాలన్నారు. ఇలా దాడులు చేయడం ఏంటని ప్రశ్నించారు. తమపై దాడి చేస్తారని మంగళవారం రాత్రి నుంచి పోలీసులకు ఫోన్ చేసినా ఎవరు స్పందించలేదని ఆరోపించారు. తీరా వారు వచ్చి దాడి చేసి వెళ్లిపోయాక వచ్చారని పేర్కొన్నారు. కాగా దాడి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.